బద్రీనాథ్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, తమన్నా, ప్రకాష్ రాజ్, కెల్లీ దోర్జ్, అశ్వనీ కల్‌శేఖర్, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, గీతాసింగ్, కృష్ణభగవాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి వి వినాయక్ నిర్వహించారు మరియు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగితదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
భీష్మనారాయణ్ (ప్రకాష్‌రాజ్) ఉత్సాహవంతులైన యువ బృందానికి శిక్షణ ఇచ్చి యోధుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ యోధులలో ఒకరు బద్రి(అల్లు అర్జున్). భీష్మనారాయణ్ ఇచ్చినటువంటి కఠినమైనటువంటి ట్రైనింగ్ శిక్షణలో తనదైన ముద్రని వేస్తాడు బద్రి. అతని నైపుణ్యాలను చూసినటువంటి భీష్మనారాయణ్ ఒక్కొక్కరినీ ఒక్కో పుణ్యక్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా నియమిస్తారు. బద్రినాథ్‌కి బద్రినాథ్ క్షేత్రం దక్కుతుంది. ఒకరోజు బద్రినాధ్ క్షేత్రానికి అలకానంద (తమన్నా) వస్తుంది. అలకానంద యువతికి దేవుడంటే నమ్మకం లేదు. అలక ప్రాణాలకు శంకర్(కెల్లీ దోర్జి) నుంచి ముప్పు ఉందని తెలుసుకున్న బద్రి ఆమెను కాపాడే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకొంటాడు. కానీ బద్రి సాహసాలకు, భక్తికి మెచ్చిన భీష్మ నారాయణ అతన్ని తక్షశిలకు తన తరవాత గురువును చేయాలనుకుంటాడు. అలా ఉండాలంటే ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలి. దాంతో బాధపడుతున్న అలకనందను ఓదారుస్తూ ఆమె ప్రేమిస్తుంది తననే అని తెలియక బద్రీనాథ్ కు మొక్కుకో నీ ప్రియుడు నీకు దక్కుతాడు అని చెబుతాడు బద్రి. అటువంటి సమయంలో అలకనందాదేవి బద్రినాధ్ ప్రేమలో పడడం, తన ప్రేమని సక్సెస్ చేయాల్సిందిగా బద్రినాధ్ దేవుడుని ప్రార్దించడం జరుగుతుంది. ఆ తరవాత ఏం జరిగింది? బద్రినాథ్-అలకల మనసులు ఎలా కలిశాయి అనేదే చిత్ర కథ.