X
Home టాప్ లిస్టింగ్

ప్రస్తుతం టాలీవుడ్ ని రూల్ చేస్తోన్న టాప్ 5 హీరోయిన్స్..!

Author Administrator | Updated: Friday, July 7, 2023, 11:38 AM [IST]

సినిమా ప‌రిశ్ర‌మలో హీరోల‌కు ఉన్న కెరీర్ గ్రాఫ్ హీరోయిన్స్‌కు ఉండ‌దు. అందుకు చాలా కార‌ణాలే ఉంటాయి. ప్ర‌తి ఏడాది ప్ర‌తి ఇండ‌స్ట్రీలోకి చాలా మంది కొత్త హీరోయిన్స్ వ‌స్తుంటారు. దీని వ‌ల్ల వారిలో వారికి తెలియ‌ని కాంపిటీష‌న్ నెల‌కొంటుంది. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే, స‌క్సెస్ రేట్ అనేది హీరోయిన్ విష‌యంలో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ ఉంటారు. హీరోయిన్స్ విషయంలో గోల్డెన్ లెగ్ హీరోయిన్స్ ఎవ‌రా అని కొంద‌రైతే వెతికి మ‌రీ ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ఇచ్చి సినిమాల్లోకి తీసుకుంటూ ఉంటారు. ఏ మాత్రం తేడా కొట్టినా ఐర‌న్ లెగ్ హీరోయిన్‌గా ముద్ర వేసేసి ప‌క్క‌న పెట్టేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఒక వైపు పెర్ఫామెన్స్‌, మ‌రో వైపు గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటూనే కెరీర్‌ను బ్యాలెన్స్ చేయ‌టం హీరోయిన్స్‌కి క‌త్తి మీద సామే. ఇంత కాంపిటీష‌న్‌లోనూ కొంద‌రు హీరోయిన్స్ మాత్రం త‌మదైన గుర్తింపును సంపాదించుకుని అవకాశాల‌ను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్నారు. ప్ర‌స్తుతం స్టార్ హీరోయిన్స్ రేసులో దూసుకెళ్తోన్న మ‌న క‌థానాయిక‌లెవ‌రో చూద్దాం...


cover image
రష్మిక మందన్న
1

ఈ శాండిల్ వుడ్ చిన్న‌ది చేసిన సినిమాల్లో గ‌త ఏడాది సీతా రామం మిన‌హా మ‌రేదీ హిట్ కాలేదు. బాలీవుడ్ సినిమాల‌న్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు అమ్మ‌డు రెండు సినిమాల‌ను ప్ర‌ధానంగా న‌మ్ముకుంటోంది. అవి ఒక‌టి యానిమ‌ల్‌. ర‌ణ్‌భీర్ క‌పూర్‌, సందీప్ వంగా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. దీంతో అటు హిందీ, ఇటు సౌత్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకోవాల‌నుకుంటోంది ర‌ష్మిక‌. అలాగే పుష్ప 2. పాన్ ఇండియా మూవీగా బ‌న్నీ, సుకుమార్ కాంబోలో వ‌స్తున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేష్స్ ఉన్నాయి. పుష్ప ది రైజ్ హిట్ కావ‌టంతో పుష్ప 2 కోసం ప్రేక్ష‌కులు వెయిట్ చేస్తున్నారు. ఇది కాకుండా రెయిన్ బో అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలోనూ ర‌ష్మిక క‌నిపించ‌నుంది. 

 

కీర్తి సురేష్
2

ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. ఓ వైపు స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తోంది. ఈ ఏడాది పాన్ ఇండియా మూవీ ద‌స‌రాలో విల‌క్ష‌ణ‌మైన డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్‌లో ఆయ‌న చెల్లెలుగా క‌నిపించ‌నుంది. ఇవి కాకుండా మామ‌న్న‌న్‌, సిరెన్ వంటి సినిమాల‌తో పాటు ర‌ఘుతాత‌, రివాల్వ‌ర్ రాణి వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పించ‌టానికి రెడీ అయ్యింది. 

శ్రుతిహసన్
3

క‌మ‌ల్ త‌న‌య అనే కార్డ్‌తో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్‌చేసినప్ప‌టికీ అతి త‌క్కువ కాలంలోనే త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ శ్రుతీ హాస‌న్‌. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ ఆడియెన్స్‌ను అల‌రించిన ఈ చెన్నై సోయ‌గం మ‌ధ్య ల‌వ్, లివి ఇన్ రిలేష‌న్ అంటూ సినీ రంగానికి దూర‌మైంది. బ్రేక‌ప్ త‌ర్వాత ఈమెను ప‌ట్టించుకుంటారో లేదోన‌ని అంద‌రూ అనుకున్న‌ప్ప‌టికీ క్రాక్‌, వకీల్ సాబ్ వంటి సినిమాల‌తో హిట్స్ కొట్టి మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేసింది. ఈ ఏడాది వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహా రెడ్డి చిత్రాల‌తో స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్న ఈ సోయ‌గం ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేసింది. ఇది సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా నాని 30వ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఇవి కాకుండా ది ఐ అనే సినిమాలోనూ న‌టిస్తోంది శ్రుతీ హాస‌న్‌. 

శ్రీ లీల
4

పెళ్లి సంద‌డి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డుకి తొలి సినిమా హిట్‌తో స్వాగతం ప‌ల‌క‌లేదు. అయితే అమ్మ‌డి అందం, న‌ట‌న కలిసొచ్చాయి. ఆ త‌ర్వాత ఈమె హీరోయిన్‌గా న‌టించిన తెలుగు సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌టంతో ఆమెకు చాలా మంచి గుర్తింపు ద‌క్కింది. అక్క‌డి నుంచి ఆమె వెనుదిరిగి  చూసుకోలేదు. వ‌రుస అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంది. ప్ర‌స్తుతం ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో  శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. అందులో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్  సినిమాతో పాటు సూప‌ర్ స్టార్ మ‌హేష్ 28వ సినిమా, నితిన్ 32వ సినిమా, రామ్ - బోయ‌పాటి సినిమా, నంద‌మూరి బాల‌కృష్ణ 108వ చిత్రం, విజ‌య్ దేవ‌ర‌కొండ, వైష్ణ‌వ్ తేజ్ సినిమాలున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్టుల‌తో పాటు జూనియ‌ర్‌, అన‌గ‌నగా ఒక‌రోజు సినిమాలు కూడా అమ్మ‌డి చేతిలో ఉన్నాయి. 

సంయుక్త మీనన్
5

ప్రారంభంలో తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైన ఈ బ్యూటీ క్వీన్ భీమ్లా నాయక్‌తో ప‌ల‌క‌రించింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె న‌టించిన బింబిసార కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. త‌ర్వాత వ‌చ్చిన సార్ కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. రీసెంట్‌గా విడుద‌లైన విరూపాక్ష సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది సంయుక్తా మీన‌న్‌. దీంతో టాలీవుడ్ ఈమెపైనే ఉంది. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ రామ్‌తోనే చేసిన డెవిల్ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకునే ప‌నిలో ఉంది. ఇది కూడా హిట్ అయితే సంయుక్తా మీన‌న్‌కి మ‌రిన్ని ఆఫ‌ర్స్ క్యూ క‌డ‌తాయ‌న‌టంలో సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+