X
బలగం
Drama | 03 Mar 2023 | U | 131 Mins
Telugu

బలగం స్టోరీ

బలగం మూవీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌, జబర్దస్త్ వేణు, రచ్చ రవి  తదితరులు నటించారు.  కమెడియన్  వేణు దర్శకత్వం వహించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డ్డి కలిసి నిర్మించారు.  సంగీతం భీమ్స్ అందించారు. 

కథ 
వయసు పైబడిన గాజుల కనకయ్య మాటల్లో చిలిపితనం, రొమాన్స్ ఏ మాత్రం కొదువ ఉండదు. ఊర్లో చిన్న పిల్లల నుంచి వయసున్న మహిళలతో సరదాగా పరాచకాలు ఆడుతుంటాడు. పైకి సంతోషంగా కనిపించినా జీవితంలో ఏదో వెలితి కారణంగా మనో వేధనకు గురయ్యే కనకయ్య ఉన్నట్టుండి చనిపోతాడు. జీవితంలో ఏనాడు పెద్దగా పట్టించుకొని కనకయ్య కొడుకులు అయిలయ్య, మొగిలయ్య (మైమ్ మధు), కూతురు లక్ష్మీ కుటుంబాలు కలిసి కనకయ్య అంత్యక్రియలు చేస్తారు. అయితే కనకయ్య మరణం తర్వాత మూడొద్దులు, ఐదొద్దులు సమయంలో పిండాలను పిట్ట ఎందుకు ముట్టలేదు? తండ్రికి పిండం పెడితే.. కాకి ముట్టకపోతే ఆ కుటుంబంలో ఏం జరిగింది? తండ్రికి కూతురు లక్ష్మీ ఎందుకు దూరంగా ఉంది? తండ్రి మరణం తర్వాత అన్నదమ్ములు, చెల్లెలు మధ్య ఎందుకు అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయిలయ్య కొడుకు సాయిలు ఎందుకు అప్పుల పాలయ్యాడు? తాత మరణాన్ని కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏం చేశాడు. తన అత్త లక్ష్మీ కూతురు సంధ్యను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని సాయిలు (పులికొండ ప్రియదర్శి) పరిష్కరించేందుకు ఏం చేశాడు? చివరకు కనుకయ్య పిండాలను పిట్ట ముట్టిందా? అనే ప్రశ్నలకు సమాధానమే బలగం సినిమా. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+