X
Home టాప్ లిస్టింగ్

మహేష్ బాబు రిజెక్ట్ చేసిన టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాలు

Author Administrator | Updated: Thursday, July 13, 2023, 05:02 PM [IST]

సూపర్ స్టార్ మహేష్ బాబు 25 కు పైగా సినిమాలలో నటించాడు. ఇందులో కొన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు.అందులో ముఖ్యంగా 5 సినిమాలు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.


cover image
నువ్వేకావలి

నువ్వే కావాలి, స్రవంతి రవి కిషోర్ ఈ సినిమా కథను మొదట మహేష్ కు చెప్పారట. అలాగే సినిమా ఒరిజినల్ వెర్షన్ సిడి కూడా పంపించాడట. మహేష్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ సినిమాను తరుణ్ ను పెట్టి చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

ఇడియట్

ఇడియట్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే రవితేజ కన్నా ముందు నలుగురు హీరోలు ఈ సినిమాకు నో చెప్పారు. వారంతా కూడా రిజెక్ట్ చేశారు. అందులో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఆడియన్స్ ఇలాంటి పాత్రలో నన్ను యాక్సెప్ట్ చేయరని ఈ సినిమా చేయలేనని నో చెప్పాడట మహేష్.

గజిని

దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని మహేష్ తోనే తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ పాత్ర తనకు సెట్ అవుతుందో లేదో అని భావించిన మహేష్ సున్నితంగా తిరస్కరించాడు.దీనితో మురుగదాస్.. సూర్యతో ఆ చిత్రం చేశారు. తమిళంలో ఘనవిజయం సాధించిన తర్వాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించాలని అనుకున్నారు. దీనితో మరోసారి మహేష్ ని సంప్రదించగా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక చేసేది లేక అమీర్ ఖాన్ ని ఎంచుకున్నారు. హిందీలో ఆ చిత్రం రికార్డులు తిరగరాసింది. 

లీడర్

రానా హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కోసం కూడా మొదట మహేష్ బాబు ని సంప్రదించారట. మహేష్ బాబు కథ పరంగా ఓకే చెప్పినప్పటికీ కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని కోరారట. దానికి శేఖర్ కమ్ముల ఒప్పుకోకపోవడంతో మహేష్ బాబు తప్పుకున్నాడు.

పుష్ప

పుష్ప, సుకుమార్ తయారుచేసిన ఈ కథ కు బాడీ లాంగ్వేజ్, గెటప్ చేంజ్ చేస్తే చేద్దాం అని అన్నారట. అందుకు సుకుమార్ ఒప్పుకోక పోవటం తో మహేష్ నో చెప్పారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+