బావ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్థ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రణిత, తణికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్, సామ్రాట్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాం బాబు నిర్వహించారు మరియు నిర్మాత: ఎమ్ ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
మోతుబరి సీతారామ్(రాజేంద్రప్రసాద్)కి ఓ కోరిక. అది తన కొడుకు వీరబాబు(సిద్దార్ద్)కి అన్ని విధాలుగా అల్లుడిని జాగ్రత్తగా చూసుకునే కుటుంబంలోని పిల్లను తెచ్చి పెళ్లి చేయాలని(అలాంటి సంభంధం తేవాలని ఏ ప్రయత్నం చేయడు). అయితే ఇదేమీ పట్టించుకోని వీరబాబు.. ఎప్పుడూ నలుగురు కుర్రాళ్ళను వేసుకుని తిరుగుతూ పనిలో పనిగా ప్రక్కవూరి అమ్మాయి వరలక్ష్మి(ప్రణీత) తో ప్రేమలో పడతాడు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి నానా తిప్పలూ పడి ప్రేమను ఓకే చేయించుకుంటాడు. అంతే ఇదేదో తెలిసినట్లుగా ఆమెకు ఇంట్లో వాళ్ళు కంగారుగా నిశ్చితార్ధం ఏర్పాటు చేసేస్తారు. దాంతో ఆమె ఏడుస్తూ వీరబాబు దగ్గరకు వస్తుంది. ఆమె భాధను చూడలేని వీరబాబు ఆవేశంగా, అత్యంత రహస్యంగా ఆమె మెడలో మూడు ముళ్ళూ వేసేసి ఓదారుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీరబాబు నాన్న...నేనేం తీసిపోయానా అన్నట్లు మరింత ఆవేశంగా ఓ ప్లాష్ బ్యాక్ వివరిస్తాడు. ఆ ప్లాష్ బ్యాక్ లో ఏముందీ అంటే..పాతికేళ్లనాడు వరలక్ష్మి మేనత్తను తాను పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్ళి చేసుకున్నానని, అందుకే ఆ రెండు కుటుంబాలకు మాటలు లేవని, మళ్లీ ఆ తప్పు రిపీట్ చేయవద్దని చెప్తాడు. వరలక్ష్మి తన మరదలు అని తెలుసుకున్న వీరబాబు అప్పుడు ఏం చేసాడు. ఎలా వరలక్ష్మిని తనదాన్ని చేసుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.