బెంగాల్ టైగర్ (2015)(U/A)
Release date
10 Dec 2015
genre
బెంగాల్ టైగర్ స్టోరి
బెంగాల్ టైగర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మాస్‌మహరాజ్ రవితేజ, తమన్నా, రాశిఖన్నా, బోమన్ ఇరాని, రావు రమేష్, షియాజి షిండే, నాజర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, సత్యం రాజేష్, బ్రహ్మాజి, పృద్వి, తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి మాటలు-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం.. సంపత్ నంది నిర్వహించారు మరియు నిర్మాత కె కె రాథామెహన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు.
కథ
ఊళ్లో మంచి పనులు లాంటి జులాయి పనులు చేస్తూండే రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలాంటి కుర్రాడు ఆకాష్ నారాయణ్(రవితేజ). అతను ఓ పెళ్లి చూపులకు వెళితే..అక్కడ పెళ్లి కూతురు(అక్ష) తను ఫేమస్ అయిన వాడినే చేసుకుంటానని రిజెక్టు చేస్తుంది. దాంతో హఠాత్తుగా ఫేమస్ అయిపోవాలని ఫిక్స్ అయిన ఆకాష్...తమ ఊరికి వచ్చిన అగ్రికల్చర్ మినిస్టర్(షాయేజి షిండే)ని రాయితో కొట్టి మీడియాకు ఎక్కుతాడు. అయితే ఫేమస్ అవటం కోసం చాలా ధైర్యంతో మినిస్టర్ ని కొట్టిన విధానం నచ్చిన మినిస్టర్ అతన్ని తన అనుచరుడుగా పెట్టుకుంటాడు. (ఫేమస్ అవటం కోసం రాయితో కొట్టడమేంటి..వాడికి ఏమన్నా పిచ్చా లేక..తింగరా అని ఆలోచించడు మినిస్టర్...ఇక్కడ దర్శకుడు ...పొలిటీషన్స్ కు బుర్ర ఉండదు అనే విషయాన్ని చక్కగా చెప్పాడు) అక్కడ నుంచి అతన్ని హోం మినిస్టర్ నాగప్ప (రావురమేష్ )కి పరిచయం చేస్తాడు. హోం మినిస్టర్..తన కూతురు శ్రద్ధ(రాశీ ఖన్నా)కి బాడీ గార్డ్ గా ఆకాష్ ని నియమిస్తాడు. (అదేంటి తన కూతురుకే సెక్యూరిటీ ఇవ్వలేనివాడు హోం మినిస్టర్ ఏంటి...రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఫోర్స్ అతని చేతులో ఉంటుంది కదా అనకండి..అతనికి ఆ టైమ్ లో అది గుర్తుకు రాకపోయి ఉండవచ్చు). అక్కడ నుంచి మన హీరో ఆకాష్ ...హోం..కూతురుని ప్రేమలో పడేసి, పెళ్లి దాకా తెస్తాడు. పెళ్లి విషయాన్ని ఎనౌన్స్ చేద్దామనుకున్న సమయంలో ...అతను దానికి నో చెప్పి..తాను సిఎం సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అసలు ఆకాష్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఇదంతా కేవలం తను ఫేమస్ అవ్వడం కోసమే చేసాడా? లేక దీని వెనుక ఏదన్నా గతం ఉందా? ఉంటే అదేంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie బెంగాల్ టైగర్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు