X
Home టాప్ లిస్టింగ్

అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు..ఎన్ని హిట్స్ వదులుకున్నాడో చూడండి.

Author Administrator | Updated: Monday, May 1, 2023, 10:04 PM [IST]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు....ఇటీవల అల వైకుంఠపురములో అనే బ్లాక్‌బస్టర్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు.బన్నీ కెరీర్‌లో అందరి హీరోలకన్నా సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు.


cover image
జయం
1

బన్నీ తొలిచిత్రం గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించాడు.కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు.

భద్ర
2

 బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లడం సూపర్ హిట్‌గా నిలవడం జరిగింది.

100% లవ్
3

సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది.కానీ ఆ సినిమా నాగ చైతన్యకు వెళ్లింది.

పండగ చేస్కో
4

గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో 'పండగ చేస్కో' సినిమా కూడా బన్నీకే తొలి అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా యంగ్ హీరో రామ్ ఎగరేసుకుపోయాడు.

ఒక లైలా కోసం
5

నాగ చైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేసాడు. 

కృష్ణాష్టమి
6

సునీల్ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కృష్ణాష్టమి చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడట. 

అర్జున్ రెడ్డి
7

సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్ర కథ మొదట బన్నీ, ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

గ్యాంగ్ లీడర్
8

దర్శకుడు విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ తో చేయాలని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల వద్దనుకున్నాడు. 

డిస్కొ రాజా
9

డిస్కొ రాజా సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ,పాయల్ రాజ్ పుత్, వెన్నెల కిషోర్, తాన్య హోప్, నరేష్, సునీల్, సత్య అక్కల,  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి అనంద్ నిర్మించారు మరియు నిర్మాత రామ్ తళ్ళూరి సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ యస్ స్వరాలు అందించారు. ఈ చిత్రం కూడా అల్లు అర్జున్ చేత రిజెక్ట్ కాబడింది.

జాను
10

96 తెలుగు రీమేక్ లో మొదట దిల్ రాజు హీరోగా బన్నీని అనుకున్నారట. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేసాడు. 

అరవింద సమేత వీరరాఘవ
11

ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అరవింద సమేత కథని త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించలేదు. 

గీత గోవిందం
12

దర్శకుడు పరుశురాం గీత గోవిందం కథని మొదట అల్లు అర్జున్ కు వినిపించారట. ఈ కథని కూడా కొన్ని కారణాల వల్ల బన్నీ రిజెక్ట్ చేసాడు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+