బేతాళుడు సినిమా తమిళంలో సైతాన్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో భేతాళుడుగా విడుదలవుతోంది...సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ అంటోని, అరుంధతి నాయర్, చారు హాసన్, మీర కృష్ణన్, వై జి మహేంద్రన్, మురుగదోస్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీ క్రిష్ణమూర్తి నిర్వహించారు మరియు నిర్మాత ఎస్ వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు విజయ్ ఆంటోని స్వరాలు సమకుర్చరు.
కథ
ఓ వ్యక్తి తనకు వినపడుతున్న వాయిస్ లతో ఓ సాల్వ్ కాకుండా మిగిలిపోయిన మర్డర్ కేసుని ఇన్విస్ట్ గేట్ చేస్తాడు. ఈ ప్లాట్ గురించి ఎక్కువ చెపితే...చూద్దామనుకునే వాళ్ల ఆసక్తి పాడు చేసినట్లు అవుతుంది. సినిమాలో ఏం బాగుంది అంటే...మనల్ని ఆశ్చర్యపరిచే ప్లాట్ ట్విస్ట్ లు. అవే సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. అదేమిటో రివీల్ చేయల్ చేస్తే చూసేవాళ్లుకు ఇబ్బంది. ఈ సినిమా ప్లస్ పాయింట్ ఏమిటీ అంటే సినిమా ప్రారంభం నుంచి సోది లేకుండా స్ట్రైయిట్ గా కథలోకి వచ్చేయటం. ప్రారంభ సీన్స్ లోనే విజయ్ ఆంటోని మానసిక రుగ్మతను ఎస్టాబ్లిష్ చేసి ఆసక్తిరేపటం. అక్కడే మనల్ని కట్టిపారేస్తాడు దర్శకుడు.