బెట్టింగ్ బంగార్రాజు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, నిధి, కోట శ్రీనివాసరావు, గిరిబాబు, చలపతిరావు, ప్రగతి, రఘుబాబు, కృష్ణభగవాన్, అమిత్, జై వేణు, ఎల్బీ శ్రీరామ్, హేమ, సురేఖావాణి, కల్పన, విజయ్‌సాయి, ప్రవీణ్, ఫణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత రామోజిరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు.
కథ
అనగనగా మహా సుడిగాడుగా పేరు తెచ్చుకున్న సత్తుపల్లి బంగార్రాజు(నరేష్). అతనుఎప్పుడూ టైటిల్ కి తగ్గట్లు బెట్టింగ్ లు కడుతూ, గెలుస్తూ హ్యాపీగా తన పల్లెలో రోజులు గడిపేస్తూంటాడు. అలాంటి వాడికి ఓ రోజు హైదరాబాద్ వెళ్ళి అక్కడో అమ్మాయిని అర్జెంటుగా ప్రేమలో పడేసి పెళ్ళిచేసుకోవాలని బుద్ది పుడుతుంది(అంత తెలివైన వాడికి ఇదేం బుద్ది అనకండి). పుట్టిందే..తడువుగా హైదరాబాద్ లో వాలిపోయి...అక్కడ రోడ్డుపై కనపడ్డ దివ్య (నిధి) కి మనసిచ్చేస్తాడు. అయితే దివ్యకి అప్పటికే మరో ముగ్గురు (అమిత్, సమ్రాట్, శ్రీ అక్షయ్) ప్రేమ ప్రపోజల్ చేస్తారు. దాంతో తెలివైన(?) దివ్య ఈ నలుగురుని ఓ చోటకి రప్పించి...మీరు నలుగురు మా ఇంటికి రండి...అక్కడో పదిహేను రోజులు ఉంటే మా పెద్దవాళ్ళుకి ఎవరు నచ్చితే వారి చేత తాళి కట్టించుకుంటాను అంటుంది.అలాంటి పరిస్ధితుల్లో బంగార్రాజు తన తెలివితో ఎలా ఆమెను గెలుచుకున్నాడనేది మిగతా కథ.