X
తెలుగు » సినిమాలు » బెట్టింగ్ బంగార్రాజు
బెట్టింగ్ బంగార్రాజు

బెట్టింగ్ బంగార్రాజు

Comedy | Romance | 09 Apr 2010 | U/A |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

బెట్టింగ్ బంగార్రాజు స్టోరీ

బెట్టింగ్ బంగార్రాజు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్‌, నిధి , కోట శ్రీనివాసరావు, గిరిబాబు, చలపతిరావు, ప్రగతి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అమిత్‌, జై వేణు, ఎల్బీ శ్రీరామ్‌, హేమ, సురేఖావాణి, కల్పన, విజయ్‌సాయి, ప్రవీణ్‌, ఫణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ సత్తిబాబు నిర్వహించారు మరియు నిర్మాత రామోజిరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు. కథ అనగనగా మహా సుడిగాడుగా పేరు తెచ్చుకున్న సత్తుపల్లి బంగార్రాజు(నరేష్). అతనుఎప్పుడూ టైటిల్ కి తగ్గట్లు బెట్టింగ్ లు కడుతూ, గెలుస్తూ హ్యాపీగా తన పల్లెలో రోజులు గడిపేస్తూంటాడు. అలాంటి వాడికి ఓ రోజు హైదరాబాద్ వెళ్ళి అక్కడో అమ్మాయిని అర్జెంటుగా ప్రేమలో పడేసి పెళ్ళిచేసుకోవాలని బుద్ది పుడుతుంది(అంత తెలివైన వాడికి ఇదేం బుద్ది అనకండి). పుట్టిందే..తడువుగా హైదరాబాద్ లో వాలిపోయి...అక్కడ రోడ్డుపై కనపడ్డ దివ్య (నిధి) కి మనసిచ్చేస్తాడు. అయితే దివ్యకి అప్పటికే మరో ముగ్గురు (అమిత్, సమ్రాట్, శ్రీ అక్షయ్) ప్రేమ ప్రపోజల్ చేస్తారు. దాంతో తెలివైన(?) దివ్య ఈ నలుగురుని ఓ చోటకి రప్పించి...మీరు నలుగురు మా ఇంటికి రండి...అక్కడో పదిహేను రోజులు ఉంటే మా పెద్దవాళ్ళుకి ఎవరు నచ్చితే వారి చేత తాళి కట్టించుకుంటాను అంటుంది.అలాంటి పరిస్ధితుల్లో బంగార్రాజు తన తెలివితో ఎలా ఆమెను గెలుచుకున్నాడనేది మిగతా కథ.
Read More

బెట్టింగ్ బంగార్రాజు కాస్ట్ & క్రూ

బెట్టింగ్ బంగార్రాజు సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇ సత్తిబాబు
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత రామోజిరావు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బెట్టింగ్ బంగార్రాజు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
టైటిల్, హీరోని నమ్ముకుని మనం ధియోటర్ లోకి వెళితే డైరక్టర్ కూడా మనలాగే టైటిల్ ని, ఇంటర్వెల్ బ్యాంగ్ ని నమ్ముకుని సినిమా తీసినట్లు అర్ధమయ్యే చిత్ర రాజం బెట్టింగ్ బంగార్రాజు. బెట్టింగ్ ని టైటిల్ లో మాత్రమే ఉంచి ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, సెకెండాఫ్ లో కొన్ని సీన్స్ బెట్టింగ్ పై వేసి అదే టైటిల్ జస్టిఫికేషన్ అనుకోమంటాడు. దాంతో మనం ధియోటర్ కి ఏది నమ్ముకుని వెళ్తామో అది దొరకక నిరాసపడి, ఉన్నదాంతో ఎడ్జెస్టై సైలెంట్ గా బయిటకు వస్తాం. దాంతో సినిమా బావుంది అనీ చెప్పలేం...బాగోలేదనీ చెప్పటానికి పూర్తిగా మనస్సు ఒప్పదు. ఎందుకంటే అక్కడక్కడా నవ్వించాడు కదా అనేది ఒకటయితే.. ప్రక్క ధియోటర్లో ఇంత కన్నా చెత్త ఆడుతోంది కదా అని మనలో మనం సమాధానపరుచుకుని మధ్యస్తంగా ఓకే అనేస్తాం. అదే బెట్టింగ్ బంగార్రాజు పరిస్దితి. కథ,కథనంలోనే లోపాలుతో తయారైనా అక్కడక్కడా రఘుబాబు లాంటి క్యారెక్టర్స్ తో నవ్వించి ఫరవాలేనిపించేస్తాడు. గట్టిగా బెట్ కాసి హిట్ అని చెప్పమంటే మొహం చాటేసేలా చేస్తాడు.

బెట్టింగ్ బంగార్రాజు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

బెట్టింగ్ బంగార్రాజు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+