X
Home టాప్ లిస్టింగ్

హిట్ టాక్ తెచ్చుకొని ప్లాప్ అయిన టాప్ 7 మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Thursday, March 23, 2023, 02:24 PM [IST]

కొన్ని సినిమాలు మనసుకు దగ్గరవుతుంటాయి. అలా మనసుకు చేరువైన సినిమాలన్నీ విజయం కూడా సాధించాలని లేదు. కొన్ని నచ్చుతాయి కానీ ఆ సమయానికి ఎందుకో ఫ్లాప్ అవుతుంటాయి. అంత మాత్రానా అవి చెడ్డ సినిమాలు అయిపోవు. కాలం కలిసిరాక అలా కమర్షియల్ విజయానికి దూరమవుతుంటాయి. అలాంటి కొన్ని మంచి సినిమాలు ఇప్పుడు చూద్దాం.


cover image
ఆరెంజ్
1

రామ్ చరణ్ కెరీర్‌లో చాలా మంచి సినిమా ఆరెంజ్. కాకపోతే రావాల్సిన దానికంటే కూడా చాలా ఏళ్ల ముందు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు బొమ్మరిల్లు భాస్కర్. ఇప్పుడు కానీ ఆరెంజ్ సినిమా విడుదలై ఉంటే కచ్చితంగా సంచలనం సృష్టించేది అంటారు విశ్లేషకులు. ఇప్పటికీ క్లాసిక్ సినిమాల్లో ఒకటి ఆరెంజ్.

 

ఖలేజా
2

మహేష్ బాబు కెరీర్లో మీకు నచ్చిన సినిమా ఏది అంటే చాలా మంది ఖలేజా అని చెబుతారు. ఓ రకంగా దూకుడు సినిమా రావడానికి కారణం ఇదే. మహేష్‌లోని కామెడీ టైమింగ్‌ను పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లోర్ చేసిన సినిమా ఇదే. కానీ థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయినా టీవీలో మాత్రం ఖలేజా బ్లాక్ బస్టర్.

ప్రస్థానం
3

శర్వానంద్‌కు కమర్షియల్ ఇమేజ్ లేని సమయంలో వచ్చిన సినిమా ప్రస్థానం. దేవాకట్టా తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రశంసల వర్షంతో పాటు అవార్డులు కూడా కురిసాయి. కానీ కాసులు మాత్రం కురవలేదు. నటుడిగా శర్వాను చాలా మెట్లు ఎక్కించిన సినిమా ఇది. సాయి కుమార్ నటన ఇందులో అద్భుతం.

ఎటో వెళ్ళి పోయింది మనసు
4

నాని, సమంత అక్కినేని జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన సినిమా ఎటో వెళ్లిపోయింది మనసు. ఈ రోజుకు అడిగినా కూడా పది మందిలో 6 గురు ఈ చిత్రం ఫేవరేట్ అంటారు. కానీ ఆ టైమ్‌కు ఈ చిత్రం వర్కవుట్ కాలేదంతే.

నాని
5

కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయాలనుకోవడం మంచిదే కానీ మరీ కొత్తదనం ఎక్కువైపోతే మాత్రం అప్పుడప్పుడూ నాని లాంటి సినిమాలు వస్తాయి. సినిమా చూడ్డానికి చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఫలితం మాత్రం చాలా దారుణంగా వచ్చింది. 

హలో
6

అఖిల్ అక్కినేని హీరోగా నాగార్జున రీ లాంచ్ చేసిన సినిమా హలో. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం చాలా అందంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా నీట్‌గా తెరకెక్కించాడు విక్రమ్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ కూడా చేసాడు. కానీ సినిమా మాత్రం మంచి టాక్ తెచ్చుకున్నా కూడా వర్కవుట్ కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+