X
భాగమతి
Drama | Horror | Thriller | 26 Jan 2018 | U/A | 142 Mins
Telugu

భాగమతి స్టోరీ

భాగమతి సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి, జయరామ్, ఆశ శరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ వహించారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు. 

కథ

చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి. మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తి (ఉన్ని ముకుందన్)తో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఏకంగా మంత్రికి ఎదురుతిరుగుతుంది. భాగమతి బంగ్లాలో చంచలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజాయితీపరుడైన మంత్రి ఈశ్వర ప్రసాద్‌కు ఎందుకు ఎదురు తిరిగింది? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మంత్రిని ఎందుకు చంచల ఎదురించాల్సి వచ్చింది? ప్రియుడు శక్తిని చంచల ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది. తన అనుకొన్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్ర కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+