X
భాగమతి

భాగమతి

Drama | Horror | Thriller | 26 Jan 2018 | U/A | 142 Mins
Telugu

2.7 /5 Users

2.5 /5 Filmibeat

భాగమతి స్టోరీ

భాగమతి సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుష్క ప్రధాన పాత్ర పోషించగా, ఉన్ని ముకుందన్, ఆది పినిశెట్టి, జయరామ్, ఆశ శరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అశోక్ వహించారు మరియు నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ ఎస్ స్వరాలు అందించారు.  కథ చంచల (అనుష్క) ఓ ఐఏఎస్ అధికారి. మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తుంది. సామాజిక కార్యకర్త శక్తి (ఉన్ని ముకుందన్)తో ప్రేమలో పడుతుంది. రైతుల సంక్షేమం మంత్రి ఈశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రాణధార ప్రాజెక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తుంది. కానీ ఓ కారణంగా ప్రియుడు శక్తిని కాల్చి జైలుకెళ్తుంది. జైలులో రిమాండ్‌లో ఉన్న చంచలను ఓ ఆపరేషన్ కోసం భాగమతి బంగ్లాకు తరలిస్తారు. ఈ క్రమంలో ఓ లక్ష్యం కోసం ఏకంగా మంత్రికి ఎదురుతిరుగుతుంది. భాగమతి బంగ్లాలో చంచలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? నిజాయితీపరుడైన మంత్రి ఈశ్వర ప్రసాద్‌కు ఎందుకు ఎదురు తిరిగింది? ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మంత్రిని ఎందుకు చంచల ఎదురించాల్సి వచ్చింది? ప్రియుడు శక్తిని చంచల ఎందుకు షూట్ చేయాల్సి వచ్చింది. తన అనుకొన్న లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భాగమతి చిత్ర కథ.
Read More

భాగమతి కాస్ట్ & క్రూ

భాగమతి సిబ్బంది సమాచారం

దర్శకత్వం అశోక్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భాగమతి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) నిజాయితీ అయిన రాజకీయవేత్తగా చూపించడం. రైతుల సంక్షేమం కోసం ప్రాణధార అనే ప్రాజెక్ట్‌ను చేపట్టమనే అంశాలతో తొలి భాగం పాజిటివ్ నోట్‌లో ప్రారంభమవుతుంది. రాజకీయాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రక్షాళన చేయడం అనే పాయింట్‌తో ఫీల్ గుడ్‌గా సినిమా అనిపిస్తుంది. ఓ వైపు మంత్రి ఈశ్వర ప్రసాద్‌పై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం, ఆయనను ప్రజల నుంచి దూరం చేయడానికి చంచలను రంగంలోకి దించడంతో సినిమా ఓ మలుపు తిరుగుతుంది. భాగమతి బంగ్లాలో జరిగే సంఘటనలు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. పలుమార్లు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిసాయి. అనుష్క టాలెంట్‌ను మరోసారి గుర్తు చేసే విధంగా చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రథమార్థాన్ని ముగిస్తాడు. ఇక రెండో భాగంలో కథ అనేక మలుపు తిరిగి ప్రేక్షకుడిని కొంత గందరగోళంలో పడేస్తాయి. ఊహించిన ట్విస్టులు కంగారు పెట్టిస్తాయి. సినిమా పక్కదారి తప్పుతుందా? దర్శకుడు అశోక్ తడబడుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమైన సమయంలో ఓ సామాజిక అంశాన్ని తెరమీదకు తెచ్చి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది.

భాగమతి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

భాగమతి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+