భగవత్ కేసరి సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావిపూడి వహిస్తున్నారు. నిర్మాతలు సాహు గరపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సంగీతం థమన్ ఎస్ వహిస్తున్నారు.
టీజర్
'రాజు ఆని వెనుక ఉన్న వందల మందను చూపిస్తాడు. మొండోడు ఆనికి ఉన్న ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు' అని బాలకృష్ణ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. ఆ తర్వాత బాలకృష్ణ మార్క్ ఫైట్, గ్రాండ్ సింగ్ విజువల్స్ కూడా చూపించారు. అడవి బిడ్డగా బాలకృష్ణ కనిపించనున్నారు. 'ఈ పేరు చానా ఏళ్ళు యాది ఉంటాది' అని చివర్లో వచ్చే డైలాగ్, ఆ తర్వాత బ్యాట్ పట్టుకుని బాలకృష్ణ గిటార్ కింద వాయిస్తూ సరదాగా పిల్లలతో బస్సులో వెళ్లడం హైలైట్!