భలే మంచి రోజు సినిమ యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుదీర్ బాబు, వామిక్వా గబ్బి, సాయి కుమార్, చైతన్య, పోసాని కృష్ణ మురళి, వేణు, ప్రవీన్, పృద్వి, విద్యుల్లేఖ రామన్ తదితరులు ఇరత ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీరామ్ అదిత్య నిర్వహించారు మరియు నిర్మాతలు విజయ్ కుమార్ రెడ్డి, శశిధర్ రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్ని ఎమ్ ఆర్ స్వరాలు సమకుర్చారు.
కథ
తను గాఢంగా ప్రేమించిన అమ్మాయి మాయ (ధన్య బాలకృష్ణ) వేరే వాడితో పెళ్లికి సిద్దపడితే... కోపం తెచ్చుకున్న కుర్రాడు రామ్ (సుధీర్ బాబు) ఆమెకు బుద్ది చెప్దామని బయిలుదేరుతాడు. అయితే అనుకోకుండా ఆ జర్నిలో ఓ యాక్సిడెంట్ జరిగి .. ఏరియా దాదా శక్తి(సాయికుమార్) చేతిలో ఇరుక్కుపోతాడు. రామ్ ని అతని స్నేహితుడు ..కాబోయే బావ ఆది (ప్రవీణ్ ) తన డెన్ కు తెచ్చిన శక్తి రామ్ కి ఓ కండీషన్ పెడతాడు. నీ యాక్సిడెంట్ తో నేను కిడ్నాప్ చేస్తున్న సీత (వామిక గబ్బి) అనే అమ్మాయి తప్పించుకుపోయింది కాబట్టి... ఆ అమ్మాయిని వెతికి తీసుకురా...లేకపోతే మీ స్నేహితుడుని ప్రాణాలు తీస్తా అంటాడు. అక్కడ నుంచి రామ్ ... ఆ అమ్మాయి సీతని వెతకడం మొదలెడతాడు. అందుకోసం ఈశు(వేణు), ఆల్బర్ట్ అనే ఇద్దరు కిడ్నాపర్స్ తో డీల్ పెట్టుకుంటాడు. వాళ్ళ సాయింతో ఆమెను పట్టుకోగలిగాడా... అసలు శక్తి ఆమెను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడు..అసలు వెనక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది ట్విస్ట్ లతో సాగే మిగతా కథ.