భానుమతి రామకృష్ణ (2020)
భానుమతి రామకృష్ణ స్టోరి
భానుమతి రామకృష్ణ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, సలోని లూత్రా, రాజా చెంబోలు, హర్ష, షాలిని వద్నికట్టి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ నాగోతి వహించారు. నిర్మాతలు యశ్వంత్, రఘు వర్మ నిర్మించారు. సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ అందించారు.
కథ
కెరీర్ మాత్రమే జీవితంగా భావిస్తూ, స్వతంత్ర భావాలు పుష్కలంగా ఉన్న 30 ఏళ్ల యువతి భానుమతి ( సలోని లుత్రా ). ఆమె జీవితంలో ఉన్నట్టుంది ఐదేళ్ల రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది. అహం దెబ్బ తిన్న క్రమంలో అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసే ఆమెకు రామకృష్ణ (నవీన్ చంద్ర) పరిచయం అవుతాడు. ఆధునిక భావాలు కలిగిన భానుమతి, పల్లెటూరి వాతావరణంలో పెరిగిన స్వచ్ఛమైన మనసున్న రామకృష్ణకు మధ్య లైఫ్ స్టైల్, అభిరుచుల విషయంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో వారిద్దరు మానసికంగా దగ్గరవుతారు. అయితే భానుమతి వ్యక్తిగత విషయానికి సంబంధించిన ఓ విషయంలో రామకృష్ణ చనువు తీసుకోవడంతో కొంత గందరగోళం ఏర్పడుతుంది. స్వతంత్ర భావాలు ఉండటం కారణంగా జీవితంలో ఎలాంటి ఇబ్బందులను భానుమతి ఎలా ఎదుర్కొన్నారు? గ్రామీణ వాతావరణం, దిగువ మధ్య తరగతి కుటుంబంలో ఉండే విలువల్ని పాటించే రామకృష్ణకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి కష్టాలు తారసపడ్డాయి? భానుమతి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో రామకృష్ణ ఎందుకు దూరాల్సి వచ్చింది? భానుమతి, రామకృష్ణ మధ్య చోటుచేసుకొన్న అపార్ధాలకు ఎలాంటి పరిష్కారం లభించింది? భానుమతి, రామకృష్ణ మధ్య ఏర్పడిన బంధం జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిందనే సింపుల్ ప్రశ్నలకు సమాధానమే భానుమతి రామకృష్ణ సినిమా.