X
Home టాప్ లిస్టింగ్

అభిమానుల‌ను పిచ్చెక్కిస్తోన్న ప్రభాస్ లైన‌ప్ మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Tuesday, June 27, 2023, 09:33 AM [IST]

టాలీవుడ్ స్టార్స్‌ ఒక సినిమా పూర్త‌యిన త‌ర్వాతే మ‌రో సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేవారు. ఇప్పుడా రూల్‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఇక ప్రభాస్ అయితే ఒకేసారి మూడు, నాలుగు సినిమాల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోన్నారు. ప్ర‌స్తుతం ప్రభాస్ లైన‌ప్స్ మూవీస్ గురించి తెలుసుకుందాం.


cover image
సలార్

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే   ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమాను  ఈ ఇయర్  28 సెప్టెంబర్‌న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

Project K

ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ జరుగుతోంది.2024 జనవరి 12న  సంక్రాంతి కానుకగా  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అమితాబ్, దీపికా పదుకొణే, దిశా పటానీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.  కమల్ హాసన్ ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

స్పిరిట్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాకు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ యేడాది చివర్లో  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభాస్ 25వ మూవీగా రానుంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులో డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో  ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

రాజా డీలక్స్‌

టాలీవుడ్ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మారుతి డైరెక్షన్‌లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినిమా చేస్తున్న సినిమా రాజా డీలక్స్‌ (వర్కింగ్‌ టైటిల్‌). హార్రర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా మోహనన్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది.  మేకర్స్ ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో 19వ శతాబ్దపు కాలం నాటి స్పెషల్ సెట్‌ వేశారని ఇన్‌సైడ్ టాక్‌.మారుతి టీం 40 రోజుల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసింది.

హిందీలో ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’, పఠాన్  వంటి యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్.. యూవీ క్రియేషన్స్, యశ్ రాజ్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. 

 

సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సుధ కొంగర ప్రభాస్ కలిసి స్టోరీ లైన్‌‌ను ఓకే చేయించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+