భోళా శంకర్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, రఘు బాబు, రావు రమేష్, మురళి శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మెహర్ రమేష్ వహిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందించారు
రిలీజ్
ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్
ట్రైలర్ అయితే అదిరే లెవెల్లో ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. సినిమాలో మెహర్ తమ మార్క్ ఎక్స్ పీరియర్స్ ని చూపించినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ ట్రైలర్ అయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని అర్ధం అయిపోయింది. మెగాస్టార్ తనదైన స్వాగ్ అండ్ సాలిడ్ యాక్షన్ తో అయితే అదరగొట్టగా వీటితో పాటుగా మంచి కామెడీ కూడా కనిపిస్తుంది. అలాగే సాంగ్ విజువల్స్, ఎమోషన్స్ సహా తమన్నా, కీర్తి సురేష్ లపై కూడా మంచి సీక్వెన్స్ లు చూపించారు. ఓవరాల్ గా అయితే ఓ మెగా ఎంటర్టైనర్ తో మెగాస్టార్ మరోసారి రాబోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లో మహతి సాగర్ స్కోర్ బాగుంది. ఇక ఫైనల్ బిట్ లో చిరు పవర్ స్టార్ ని ఇమిటేట్ చెయ్యడం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
టీజర్
సార్ అంటూ మాస్ ఎలివేషన్‌తో టీజర్ స్టార్ట్ అయింది. ఆపై చిరు మాస్ ఎంట్రీ, వీర లెవల్లో ఫైట్, విజిల్స్ వేయించే డైలాగ్స్, కిక్కిచ్చే డ్యాన్స్ స్టెప్పులు ఇలా మొత్తంగా టీజర్ ఊరమాస్‌గా ఉంది. ‘షికారు కొచ్చిన షేర్‌ను బే’, ‘ఇస్టేట్ డివైడ్ అయినా అందరూ నా వాళ్లే. ఆల్ ఏరియాస్ అప్నా హే. నాకు హద్దులు లేవు సరిహద్దులు లేవు.. దేక్‌లేంగే’ అంటూ మెగాస్టార్ తెలంగాణ స్లాంగ్‌తో డైలాగ్స్ అదరగొట్టేశాడు. టీజరే ఈ రేంజ్‌లో దింపితే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ముఖ్యంగా మహతి స్వరసాగర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉంది.