X
Home టాప్ లిస్టింగ్

2023 ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 మూవీస్

Author Administrator | Published: Saturday, July 29, 2023, 04:54 PM [IST]

2023 ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి మరి కొన్ని సూపర్ హట్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో 2023 విడుదలైన చిత్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 5 మూవీస్ ఇప్పుడు చూద్దాం.


cover image
ఆదిపురుష్

ఔం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సైఫ్ ఆలీ ఖాన్, క్రితి సనన్, సన్నీ సింగ్ నిజ్జర్ నటించిన ఆదిపురుష్ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల షేర్ రాబట్టి 2023లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

వీర సింహా రెడ్డి

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోస్ తదితరులు నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా తొలి రోజు రూ. 25.35 కోట్ల షేర్ రాబట్టి 2వ ప్లేస్‌లో నిలిచింది.

బ్రో

సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాాణ్, సాయి ధరమ్ తేజ్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘బ్రో’.   ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 23.61 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో నిలిచింది.

వాల్తేరు వీరయ్య

కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ హీరోలుగా శృతి హాసన్ కథానాయికగా నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.90 కోట్ల షేర్ రాబట్టింది.

దసరా

నాని, కీర్తి సురేష్, సాయి కుమార్, సముతిరకణి, దీక్షిత్ శెట్టి, పూర్ణ, జరీనా వాహబ్ తదితరులు నటించిన సినిమా ‘దసరా’. ఈ సినిమా తొలి రోజు రూ. 14.22 కోట్ల వసూళ్లను సాధించింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+