బ్లఫ్ మాస్టర్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్యదేవ్, నందితా శ్వేత, ఆదిత్యామీనన్, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్య కృష్ణ, ధన్‌రాజ్, శ్రీరామరెడ్డి , వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్, బన్నీ చందు, దిల్ రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపీగణేష్ పట్టాభి వహించారు మరియు నిర్మాత రమేష్ పిళ్లై నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కాశ్యప్ అందించారు.
కథ
డబ్బే సర్వస్వంగా భావించే ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) గ్యాంగ్ (చైతన్య కృష్ణ తదితరులు) రకరకాల పేర్లు, వేషాలతో ప్రజలను బురిడీ కొట్టించే వైట్ కాలర్ మోసగాడు. తాను మోసానికి పాల్పడుతున్న క్రమంలో అవని (నందిత శ్వేత) పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఇష్టంగా మారుతుంది. ఇదిలా యదేచ్ఛగా మోసాలు చేసి ఉడాయించే క్రమంలో పోలీసులకు పట్టుబడుతారు. తమను మోసగించారని కోపంతో బసవ గ్యాంగ్ (ఆదిత్య మీనన్, వంశీ) ఉత్తమ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు.
తనను చంపాడనికి ప్రయత్నించిన గ్యాంగ్‌ను తెలివిగా మోసగించి అక్కడి నుంచి తప్పించుకొంటాడు. ఆ క్రమంలో అవనికి చేరువతాడు. అవని పెళ్లి చేసుకొని దందాలకు దూరంగా బతుకుతుంటాడు. ఆ క్రమంలో బసవ గ్యాంగ్ చేతికికు మళ్లీ చిక్కుతాడు. ఆ క్రమంలో ప్రెగ్నెంట్‌గా ఉన్న అవని వదిలేసి ఓ ఆపరేషన్ కోసం బయలు దేరుతాడు? తాను చేపట్టిన 100 కోట్ల మోసాన్ని పక్కాగా చేయడంలో సఫలమయ్యాడా? ఈ కథలో ధనశెట్టి (పృథ్వీ) రోల్ ఏంటి? ధనశెట్టిని ఉత్తమ్ ఎలా బురిడీ కొట్టించాడు? నిండు గర్భిణిగా ఉండే అవని పరిస్థితి ఏమైంది? చివరకు ఉత్తమ్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే బ్లఫ్ మాస్టర్ కథ.