బ్రహ్మాస్త్రం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రణ్‌బీర్ కపూర్, అలియాభట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్, షారుఖ్ ఖాన్, దింపులే కపాడియా తదితరులు నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు హీరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహత కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్ చక్రవర్తి అందించారు.
కథ
అనాథ యువకుడైన శివ డీజేగా పనిచేస్తుంటాడు. అయితే తనను అగ్ని నుంచి కాపాడుకొనే అగ్యస్త్ర అనే అద్బుతమైన శక్తితో పుట్టానని గ్రహిస్తాడు. ఓ కార్యక్రమంలో డీజేగా వ్యవహరిస్తున్న సమయంలో ఇషా (ఆలియాభట్), శివ తొలి చూపులోనే ప్రేమించుకొంటారు. ఇదిలా ఉండగా, మోహన్ భార్గవ (షారుక్ ఖాన్) అనే సైంటిస్ట్ కనిపెట్టిన బ్రహ్మస్త్రను చేజిక్కించుకొనేందుకు దుష్టశక్తి జునూన్ (మౌనీరాయ్) కుట్రలు పన్నుతుంటుంది. అయితే మూడు ముక్కలుగా బ్రహ్మస్త్ర కావడంతో అవి ఎక్కడ ఉన్నాయని శోధిస్తూ శివను జునూన్ వెంటాడుతుంటుంది. జూనూన్ దుష్ట చేష్టలను ఎదురిస్తూ శివ, ఇషా పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో శివ అనాథ కాదని ఆయన పుట్టుక వెనుక రహస్యాన్ని బ్రహ్మన్ష్ గురు చెబుతాడు. బ్రహ్మస్త్ర మూడు ముక్కలు ఎందుకైంది? సైంటిస్ట్ మోహన్ భార్గవను జునూన్ ఎలా టార్గెట్ చేసింది? బ్రహ్మస్త్రాన్ని కాపాడేందుకు బ్రహ్మాన్ష్ సమాజానికి చెందిన గురు (అమితాబ్ బచ్చన్) ఏం చేశాడు? బ్రహ్మస్త్రకు నంది అస్త్రాన్ని కలిగి ఉన్న అనిష్ శెట్టి (నాగార్జున) ఏం సంబంధం? చివరకు జూనూన్ దుష్ట చేష్టలకు ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే బ్రహ్మస్త్ర సినిమా కథ.