X
తెలుగు » సినిమాలు » బ్రహ్మాస్త్రం
బ్రహ్మాస్త్రం

బ్రహ్మాస్త్రం

Drama | 09 Sep 2022 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

బ్రహ్మాస్త్రం స్టోరీ

బ్రహ్మాస్త్రం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, నాగార్జున, అమితాబ్​ బచ్చన్​, మౌనీరాయ్, షారుఖ్ ఖాన్, దింపులే కపాడియా తదితరులు నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు హీరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహత కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్ చక్రవర్తి అందించారు.  కథ అనాథ యువకుడైన శివ డీజేగా పనిచేస్తుంటాడు. అయితే తనను అగ్ని నుంచి కాపాడుకొనే అగ్యస్త్ర అనే అద్బుతమైన శక్తితో పుట్టానని గ్రహిస్తాడు. ఓ కార్యక్రమంలో డీజేగా వ్యవహరిస్తున్న సమయంలో ఇషా (ఆలియాభట్), శివ తొలి చూపులోనే ప్రేమించుకొంటారు. ఇదిలా ఉండగా, మోహన్ భార్గవ (షారుక్ ఖాన్) అనే సైంటిస్ట్ కనిపెట్టిన బ్రహ్మస్త్రను చేజిక్కించుకొనేందుకు దుష్టశక్తి జునూన్ (మౌనీరాయ్) కుట్రలు పన్నుతుంటుంది. అయితే మూడు ముక్కలుగా బ్రహ్మస్త్ర కావడంతో అవి ఎక్కడ ఉన్నాయని శోధిస్తూ శివను జునూన్ వెంటాడుతుంటుంది. జూనూన్ దుష్ట చేష్టలను ఎదురిస్తూ శివ, ఇషా పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో శివ అనాథ కాదని ఆయన పుట్టుక వెనుక రహస్యాన్ని బ్రహ్మన్ష్ గురు చెబుతాడు. బ్రహ్మస్త్ర మూడు ముక్కలు ఎందుకైంది? సైంటిస్ట్ మోహన్ భార్గవను జునూన్ ఎలా టార్గెట్ చేసింది? బ్రహ్మస్త్రాన్ని కాపాడేందుకు బ్రహ్మాన్ష్ సమాజానికి చెందిన గురు (అమితాబ్ బచ్చన్) ఏం చేశాడు? బ్రహ్మస్త్రకు నంది అస్త్రాన్ని కలిగి ఉన్న అనిష్ శెట్టి (నాగార్జున) ఏం సంబంధం? చివరకు జూనూన్ దుష్ట చేష్టలకు ఎలా ముగింపు పలికారు అనే ప్రశ్నలకు సమాధానమే బ్రహ్మస్త్ర సినిమా కథ.
Read More

బ్రహ్మాస్త్రం కాస్ట్ & క్రూ

బ్రహ్మాస్త్రం సిబ్బంది సమాచారం

దర్శకత్వం అయాన్ ముఖర్జీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రీతమ్ చక్రవర్తి
నిర్మాత హీరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్రహ్మాస్త్రం విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
భారతీయ పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకొని దుష్టశక్తిపై శక్తిమంతమైన యువకుడి చేసిన పోరాటమే బ్రహ్మస్త్ర. కంటెంట్ కంటే గ్రాఫిక్స్ డామినేట్ చేయడం సినిమాకు మైనస్. బాలీవుడ్ సినిమా ప్రమాణాలకు, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా పాత్రలను రూపుదిద్దుకొన్నారు. ఎమోషన్స్, యాక్షన్, అమితాబ్, షారుక్ లాంటి పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఇక ఆలియా, రణ్‌బీర్ కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. నాగార్జున, డింపుల్‌ను అతిథి పాత్రల కంటే దారుణంగా ట్రీట్ చేయడం సినీ అభిమానులకు రుచించని అంశంగా ఉంటుంది. ఫ్యామిలీతోపాటు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా తెగ నచ్చేస్తుంది. కొత్త జోనర్‌తో వచ్చిన ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది. కానీ సినిమా నిడివి, కథలో లాజిక్స్ లేకుండా ఉండటం కాస్త చిరాకుపెట్టే అంశం. వీకెండ్‌లో బ్రహ్మస్త్రను ఓసారి చూడొచ్చు. ఇది పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించే చిత్రం. సో లెట్స్ గో ఫర్ వాచ్ వన్స్.

బ్రహ్మాస్త్రం ట్రైలర్

Video Thumbnail

బ్రహ్మాస్త్రం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్రహ్మాస్త్రం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+