బిజినెస్ మేన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, ధర్మవరపు, భరత్ రెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
ముంబైలో డాన్ లు కరువై సెటిల్ మెంట్స్ చేసేవాళ్లు లేక విలవిల్లాడుతూంటుంది. అది తెలుసుకున్న సూర్య(మహేష్) ముంబైకి భాయ్ అవ్వటానికి వస్తాడు. అదొక వృత్తిగా, బిజినెస్ గా చేస్తానంటూ రంగంలోకి దిగుతాడు. అతి తక్కువ కాలంలోనే ..ముంబైని తన ధైర్యంతో,తన తెలివితో లొంగ తీసుకుని అంచెలెంచులుగా సూర్య బాయ్ గా ఎదుగుతాడు. అలాంటి సమయంలో అతనికి కొన్ని సవాళ్లు ఎదురౌతాయి.. వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు... అస్సలు అతనికి ఈ భాయ్ అవ్వాలనే కోరక ఎలా పుట్టింది... అతనికీ, చిత్ర (కాజల్)కీ ఉన్న రిలేషన్ ఏమిటి అన్నది తెరమీద చూడాల్సిందే.