క్యాబ్ స్టోరీస్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో దివ్య వాదత్య, శ్రీహన్, ధనరాజ్, గిరిధర్, ప్రవీణ్, సిరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె వి ఎన్ రాజేష్ వహించారు. నిర్మాత ఎస్ కృష్ణ నిర్మించారు. సంగీతం సాయి కార్తీక్ అందించారు.
కథ
గిరిధర్ ఒక క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. గిరి క్యాబ్ లో ఎక్కిన ఒక వ్యక్తి తీసుకు వెళుతున్న డ్రగ్స్ బ్యాగ్ నుంచి ఒక ప్యాకెట్ గిరి క్యాబ్లో పడుతుంది. స్వతహాగా చాలా నిజాయితీపరుడైన గిరి డ్రగ్స్ అంటే భారీగా డబ్బు సంపాదించవచ్చు అని భావించి దానిని కొట్టేసేందుకు ప్లాన్ వేస్తాడు. ఆ డ్రగ్ ప్యాకెట్ కొట్టేసేందుకు వేసిన ప్లాన్ గిరి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. ఆ ప్యాకెట్ పోగొట్టుకున్న వ్యక్తి దిగిన వెంటనే క్యాబ్ ఎక్కిన శాలిని(దివి), ఈ కథ మొత్తాన్ని ఒక కీలక మలుపు తిప్పుతుంది. అలా శాలిని తిప్పిన మలుపు ఏంటి, చివరికి డ్రగ్ ప్యాకెట్ ను గిరి ఏం చేశాడు? గిరిని డ్రగ్ మాఫియా ఏం చేసింది ? అనే కథాంశం చుట్టూ ఈ సినిమాను తెరకెక్కించారు.