X
Home టాప్ లిస్టింగ్

2022 సెకండ్ హాఫ్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Friday, July 15, 2022, 05:22 PM [IST]

2022లో అపుడే ఆరు నెల పూర్తయింది. రాబోయే 6 నెలలో రిలీజ్ కి సిద్ధంగా వున్న, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నా మోస్ట్ అవైటెడ్ మూవీస్


cover image
లైగర్
1

లైగర్ సినిమా  యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, విష్ణు రెడ్డి, ఆలీ, గెటప్ శ్రీను, మక్రంద్ దేశ్పాండే, మైక్ టైసన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరీ జగన్నాథ్ వహించారు. నిర్మాతలు చార్మి కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా కలిసి నిర్మించారు.

ఏజెంట్‌
2

ఏజెంట్‌ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్  చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని ఇంకా తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి వహిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు, ఈ సినిమాకి కథ వక్కంతం వంశీ అందిస్తున్నారు. 

 

కార్తికేయ 2
3

కార్తికేయ 2 సినిమా ఒక సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లర్ చిత్రం ఇందులో  నిఖిల్ సిద్దార్థ్,  ముఖ్య  పాత్రాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు దర్సకత్వం చందు మొండేటి వహిస్తున్నారు. 

 

హనుమాన్
4

'హనుమాన్' సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ వర్మ వహిస్తున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

హిట్ 2
5

హిట్ 2 సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డా శైలేష్ కొలను వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతం జాన్ స్టీవర్ట్ ఏడురి అందించారు. 

రామారావు ఆన్ డ్యూటీ
6

రామారావు ఆన్ డ్యూటీ  సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాథ్ రావు నక్కిన వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్, టి జి విశ్వప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. 

ప్రిన్స్
7

ప్రిన్స్ మూవీ కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  శివకార్తికేయన్‏, ఉక్రెయిన్ బ్యూటీ మారియా కథానాయికగా నటిస్తుండగా.. సత్యరాజ్, ప్రేమ్ జీ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దసరా
8

దసరా సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ ఓడేల వహిస్తున్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. 

 

పుష్ప ది రూల్
9

పుష్ప ది రూల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

 

ది ఘోస్ట్‌
10

ది ఘోస్ట్‌ సినిమా ఫాంటసీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం భరత్ సౌరభ్ అందిస్తున్నారు.

రామ్ చరణ్ 15
11

రామ్ చరణ్ 15 సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్,  జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ వహిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

 

హరి హర వీరమల్లు
12

హరి హర వీరమల్లు  సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఇందులో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రామ్ పాల్  నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా… ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు.

 

గాడ్ ఫాదర్
13

గాడ్ ఫాదర్ తెలుగు రీమేక్ సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి ఇంకా తదితరులు నటిస్తున్నారు.రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ సినిమా ఒరిజినల్ ‘తనిఒరువన్’ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్ వి ప్రసాద్, రామ్ చరణ్, ఆర్ బి చౌదరి కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+