కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులొ పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్యా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.
కథ
ఓ మామూలు మెకానిక్ రాంబాబు(పవన్) మీడియాలో వచ్చే వార్తలు చూసి అన్యాయాలను ఎదిరిస్తూంటాడు. అదే రీతిలో ఓసారి రాష్ట్రంలో రగిలిన కులచిచ్చుని ఆర్పి మీడియాలో హైలెట్ అవుతాడు. దాంతో ఈ మెకానిక్ బయిటకన్నా తమ మీడియాలో ఉంటే సమాజాన్ని రిపేర్ చేస్తాడని భావించిన కెమెరామెన్ గంగ (తమన్నా) అతనికి జర్నలిస్టుగా తను పనేచేసే ఛానెల్ లో జాబ్ ఇప్పిస్తుంది. రెంచ్ వదిలి మీడియా మైక్ పట్టుకున్న అతను మాజీ సీఎం జవహర్ నాయుడు(కోట) కీ, అతను కుమారుడు రానాబాబు(ప్రకాష్ రాజ్)కి తలనొప్పిగా మారతాడు. మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలనే రానాబాబు పొలిటికల్ ప్లాన్స్ ని అతను మీడియా ద్వారా బయిట పెట్టి వారిని రోడ్డున పెట్టేస్తాడు. అప్పుడు వారు ఎలా అతన్ని అడ్డు తొలిగించుకోవాలనుకున్నారు.. దానికి రాంబాబు ఎలా కౌంటర్ ఇచ్చి రాష్ట్ర్రాన్ని కాపాడాడు అనేది మిగతా కథ.