చెక్ సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.. హిందీలో హిట్ కొట్టిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్, సంపత్ రాజ్, సిమ్రాన్ చౌదరి, పోసాని కృష్ణ మురళి, సాయి చంద్, హర్ష వర్ధన్, సి వి ఎల్ నరసింహ రావు, కార్తీక్ రత్నం, చైతన్య కృష్ణ, కృష్ణ తేజ, మేక రామకృష్ణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చంద్ర శేఖర్ యేలేటి వహించారు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం కళ్యాణి మాలిక్ అందించారు.
కథ
ఆదిత్య (నితిన్) చేయని నేరానికి ఉరిశిక్ష పడిన ఖైదీ. గద్వాల జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో శివన్నారాయణ (సాయి చంద్) అనే తోటి ఖైదీ ప్రభావంతో చెస్ ప్లేయర్‌గా మారుతారు. అయితే ఆదిత్య కోసం లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియర్ ) కారణంగా టెర్రిరిస్టుగా ముద్ర పడ్డారనే విషయాన్ని వెల్లడిస్తారు. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట ప్రధానంగా, అలాగే జైలులో అంతర్గత పోరాటాలు నేపథ్యంగా ఆసక్తిగా సాగుతుంది. సెకండాఫ్‌లో తన సౌలభ్యం కోసం సినిమాటిక్ లిబర్టిని వాడుకొన్నారనే విధంగా సీన్లు సాగుతాయి. అయితే చెస్ ఆటలో ఉండే ఎమోషనల్ పాయింట్స్‌తో కొన్ని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. విశ్వనాథన్ ఆనంద్ ఎపిసోడ్ వరకు సినిమా సరైనా దారిలోనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాతే కాస్త కథా గమనం దారి తప్పినట్టు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చంద్రశేఖర్ యేలేటి బ్రిల్లియెన్స్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాయి.