twitter

    చి ల సౌ స్టోరి

    చి ల సౌ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుశాంత్, రుహని శర్మ, వెన్నేల కిశోర్, అను హాసన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రాహుల్ రవీంద్రన్ వహిస్తున్నారు మరియు నిర్మాత జశ్వంత్ హదిపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ప్రసాంత్ ఆర్ విహారి అందిస్తున్నారు. 

    కథ

    అర్జున్ (సుశాంత్) ప్రేమలో విఫలమై ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని పెడుతున్న పోరు భరించలేక తప్పని పరిస్థితుల్లో అంజలి ( రుహానీ శర్మ)తో పెళ్లి చూపులకు సిద్ధమవుతాడు. ఎన్నో పెళ్లిచూపులకు హాజరైన అంజలి తల్లి (రోహిణి)ని ఓ ఆరోగ్య సమస్య వెంటాడుతుంటుంది. ఇరు కుటుంబాలు లేకుండా జరిగిన పెళ్లిచూపుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంజలికి చెబుతాడు. దాంతో అంజలి ఫైర్ అవుతుంది. పెళ్లి కుదరకపోవడంతో తన తల్లి పరిస్థితి ఏమవుతుందో విషయాన్ని తలచుకొని తల్లడిల్లిపోతుంది. కానీ ఓ కారణంగా అంజలి, అర్జున్ కొన్ని గంటలు కలిసి ఉండాల్సిన పరిస్థితి రావడం వారిద్దరిని మానసికంగా దగ్గరకు చేరుస్తుంది.

    పెళ్లిచూపుల్లో అర్జున్ రిజెక్ట్ చేసిన అంజలి పరిస్థితి ఏమిటి? అంజలి తల్లికి ఉన్న ఆరోగ్య సమస్య ఏమిటి? ఏ కారణంగా వారిద్దరూ కలిసి ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది? ఓ రోజు సాయంత్రం నుంచి ఉదయం వరకు జరిగిన ప్రయాణంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయనే విషయమే చి.ల.సౌ చిత్ర కథ.

     
    **Note:Hey! Would you like to share the story of the movie చి ల సౌ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X