X
Home టాప్ లిస్టింగ్

తెలుగు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతున్న త‌మిళ తంబీలు

Author Administrator | Updated: Thursday, July 13, 2023, 05:04 PM [IST]

మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఇప్పుడు ప్రేక్ష‌కులు భాష‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు. దీంతో హీరోలు పాన్ ఇండియా సినిమాలు, ఓటీటీ మూవీస్ చేస్తూ త‌మ మార్కెట్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో త‌మిళ హీరోలు తెలుగు మార్కెట్‌పై క‌న్నేశారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ సినిమాల‌ను విడుద‌ల చేసి క‌లెక్ష‌న్స్ పెంచుకునే ప‌నిలో ఉన్నారు. త‌మిళ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర తొలిరోజు ఏ మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించాయ‌నే వివ‌రాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే..


cover image
వారసుడు
1

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ‘వారిసు’ సినిమాను తెలుగులో ‘వారసుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. సినిమా సంక్రాంతికి విడుదల కావటంతో పాటు సినిమాపై ఉన్న బజ్ కారణంగా ఈ చిత్రం తొలి రోజునే తెలుగు రాష్ట్రాల్లో రూ.3.10 కోట్లు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. 

పొన్నియన్ సెల్వన్-1
2

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్’ పాన్ ఇండియా మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో తొలి భాగంగా పొన్నియిన్ సెల్వ‌న్ 1పై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. విక్ర‌మ్, జ‌యం ర‌వి, కార్తీ, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష‌, శోభితా దూళిపాల వంటి భారీ తారాగ‌ణం, మ‌ణిర‌త్నం టేకింగ్, విజువ‌ల్స్ సినిమాపై అంచ‌నాల‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. దీంతో పొన్నియిన్ సెల్వ‌న్ 2 సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.2.88 కోట్లు వ‌సూళ్ల‌ను సాధిచింది.

 

సార్
3

ధ‌నుష్ హీరోగా తెలుగు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సార్ ’. త‌మిళంలో ‘వాత్తి’గా విడుద‌లైన ఈ చిత్రం కూడా మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్‌తోనే రూపొందింది. తెలుగు నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ.2.65 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 

బిచ్చగాడు 2
4

విజ‌య్ ఆంటోనీని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిని సినిమా బిచ్చగాడు. దీనికి సీక్వెల్‌గా రూపొందిన బిచ్చ‌గాడు 2 పై మంచి మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా రివ్యూస్‌కు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ తొలిరోజున ఆంధ్ర‌ప్ర‌దేవ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.2.32 కోట్లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 

విక్రమ్‌ కోబ్రా
5

చియాన్ విక్ర‌మ్‌, అజ‌య్ జ్ఞాన‌ముత్తు కాంబినేష‌న్ అన‌గానే కోబ్రాపై ఎక్స్‌పెక్టేష్స్ పీక్స్‌కి చేరుకున్నాయి. ఈ అంచ‌నాల‌తో కోబ్రా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ.2.28 కోట్లు వ‌చ్చాయి. హీరో విక్ర‌మ్‌కు తెలుగులో ఉన్న క్రేజ్‌ను మ‌రోసారి ప్రూవ్ చేసిన చిత్ర‌మిది. 

విక్రమ్
6

 సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌ను మ‌ళ్లీ హిట్ ట్రాక్‌కి తెచ్చిన సినిమా విక్ర‌మ్‌. లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.1.98 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క్ర‌మంగా రోజు రోజుకీ ఈ క‌లెక్ష‌న్స్ పెరిగాయి కూడా. త‌మిళంతో పాటు తెలుగులోనూ విక్ర‌మ్ మూవీ సూప‌ర్బ్ క‌లెక్ష‌న్స్ సాధించి తమిళ సినీ ఇండ‌స్ట్రీకి ఓ ఊపునిచ్చింది. 

7

రజినీకాంత్, శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం అణ్ణాత్తే. దీన్ని తెలుగులో పెద్ద‌న్న పేరుతో విడుద‌ల చేశారు. ర‌జినీకాంత్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉండ‌టంతో ఆంధ్ర‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.1.60 కోట్లు వ‌సూళ్ల‌ను సినిమా సాధించింది. 

పొన్నియన్ సెల్వన్-2
8

 మ‌ణిర‌త్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వ‌న్‌లో పార్ట్‌గా వ‌చ్చిన పొన్నియిన్ సెల్వ‌న్ 2 కూడా మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంది. తొలి రోజున ఏపీ, తెలంగాణ‌ల్లో రూ.1.37 కోట్లు వ‌చ్చాయి. ఈ చిత్రంలో భారీ తారాగ‌ణం న‌టించింది. ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. 

తెగింపు
9

 అజిత్ కుమార్ హీరోగా వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం తెగింపు. మంచి అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ మూవీ తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.1.14 కోట్లు వ‌చ్చాయి. 

 

లవ్ టుడే
10

త‌మిళంలో రూపొందిన చిత్రం ల‌వ్ టుడే. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, ఇన‌య  హీరోహీరోయిన్లుగా న‌టించారు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రం యూత్‌కు బాగా క‌నెక్ట్ కావ‌టంతో తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.1.15 కోట్లు క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. 

 

సర్ధార్
11

కార్తీ హీరోగా న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ స‌ర్దార్‌. ఇందులో ఆయ‌న డ‌బుల్ రోల్‌లో న‌టించారు. తొలి ఆట‌కే మంచి బ‌జ్ రావ‌టంతో ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.96 ల‌క్ష‌ల‌ను సాధించింది. 

ప్రిన్స్
12

త‌మిళ హీరో శివ కార్తీకేయ‌న్‌, జాతి ర‌త్నాలు ద‌ర్శ‌కుడు అనుదీప్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ప్రిన్స్ సినిమా ఏపీ, తెలంణాల్లో తొలి రోజున రూ.90 ల‌క్ష‌ల‌ను సాధించింది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+