twitter

    చిత్రలహరి స్టోరి

    చిత్రలహరి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథ పెతురాజ్, సునీల్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, భరత్ రెడ్డి, సుధర్శన్, జయ ప్రకాష్, హైపర్ ఆది ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల వహించారు మరియు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, మోహన్ చెరుకూరి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. 

    కథ

    నలుదిక్కుల సూర్యుడు ఉదయించినా జీవితంలో వెలుతురు కానరని యువకుడు విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్). టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన సక్సెస్ కోసం వెంపార్లాడే విజయ్ కృష్ణ తొలిచూపులోనే లహరి (కల్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడుతాడు. తన జీవితంలో సక్సెస్ కోసం ఓ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో స్వేచ్ఛ (నివేతా) పరిచయం అవుతుంది. అయితే నివేతా కారణంగాను, స్వయంగా కొన్ని చిన్న తప్పులు చేయడం విజయ్ కృష్ణ ప్రేమ బ్రేకప్ అవుతుంది. తన జీవిత స్వప్నమైన ప్రాజెక్ట్‌కు అనేక అవరోధాలు ఎదురవుతాయి.

    లహరితో లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? వారి ప్రేమకు నివేథా ఎలాంటి కారణమైంది? డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు తన సక్సెస్ కోసం ఎలాంటి సాహాసానికి సిద్ధపడ్డాడు. తాను చేసిన ఓ ప్రయత్నం ఎందుకు కోర్టు మెట్లేక్కేలా చేసింది. కోర్టు శిక్ష నుంచి బయటపడ్డారా? లహరి, విజయకృష్ణ లవ్ మళ్లీ చిగురించిందా? తన జీవితాశయమైన ప్రాజెక్ట్‌కు నివేథా ఎలా కారణమైందనే ప్రశ్నలకు సమాధానమే చిత్రలహరి సినిమా కథ
    **Note:Hey! Would you like to share the story of the movie చిత్రలహరి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X