X
తెలుగు » సినిమాలు » చిత్రలహరి
చిత్రలహరి

చిత్రలహరి

Romance | 12 Apr 2019 | U | 131 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

చిత్రలహరి స్టోరీ

చిత్రలహరి సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథ పెతురాజ్, సునీల్, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, భరత్ రెడ్డి, సుధర్శన్, జయ ప్రకాష్, హైపర్ ఆది  ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్ తిరుమల వహించారు మరియు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్, రవిశంకర్, మోహన్ చెరుకూరి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.  కథ నలుదిక్కుల సూర్యుడు ఉదయించినా జీవితంలో వెలుతురు కానరని యువకుడు విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్). టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన సక్సెస్ కోసం వెంపార్లాడే విజయ్ కృష్ణ తొలిచూపులోనే లహరి (కల్యాణి ప్రియదర్శన్)తో ప్రేమలో పడుతాడు. తన జీవితంలో సక్సెస్ కోసం ఓ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో స్వేచ్ఛ (నివేతా) పరిచయం అవుతుంది. అయితే నివేతా కారణంగాను, స్వయంగా కొన్ని చిన్న తప్పులు చేయడం విజయ్ కృష్ణ ప్రేమ బ్రేకప్ అవుతుంది. తన జీవిత స్వప్నమైన ప్రాజెక్ట్‌కు అనేక అవరోధాలు ఎదురవుతాయి. లహరితో లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? వారి ప్రేమకు నివేథా ఎలాంటి కారణమైంది? డ్రీమ్ ప్రాజెక్ట్‌ను సక్సెస్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు తన సక్సెస్ కోసం ఎలాంటి సాహాసానికి సిద్ధపడ్డాడు. తాను చేసిన ఓ ప్రయత్నం ఎందుకు కోర్టు మెట్లేక్కేలా చేసింది. కోర్టు శిక్ష నుంచి బయటపడ్డారా? లహరి, విజయకృష్ణ లవ్ మళ్లీ చిగురించిందా? తన జీవితాశయమైన ప్రాజెక్ట్‌కు నివేథా ఎలా కారణమైందనే ప్రశ్నలకు సమాధానమే చిత్రలహరి సినిమా కథ
Read More

చిత్రలహరి కాస్ట్ & క్రూ

చిత్రలహరి సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిశోర్ తిరుమల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత నవీన్ , వై రవి శంకర్, సి వి మోహన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

చిత్రలహరి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పుష్కలంగా ప్రతిభ ఉండి దురదృష్టం వెంటాడిన ఓ యువకుడు సక్సెస్‌ చేజిక్కించుకొనేందుకు ఎలాంటి సాహాసానికి ఒడిగట్టాడు అనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ హీరోగా ప్రేక్షకులకు తెలిసిన సాయిధరమ్ తేజ్ భావోద్వేగపూరితమైన పాత్రలో సరికొత్త కోణంలో కనిపిస్తాడు. ఎమోషనల్‌గా సాగే సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొనేలా ఉంటుంది. తిరుమల కిషోర్ భావోద్వేగాలను పండించడంలో సక్సెస్ సాధించాడని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు చేరువైతే కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

చిత్రలహరి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

చిత్రలహరి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+