క్రేజీ అంకుల్స్ (2021)(U/A)
Release date
19 Aug 2021
genre
క్రేజీ అంకుల్స్ స్టోరి
క్రేజీ అంకుల్స్ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీముఖ, మనో, రాజా రవీంద్ర, రఘుకుంచె, భరణి శంకర్, పోసాని కృష్ణ మురళి, హేమ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఈ సత్తి బాబు వహించారు. బొడ్డు అశోక్ నిర్మించారు. సంగీతం రఘు కుంచె అందించారు.
కథ
ఒక సినిమా చేయాలి అనే ఉద్దేశంతో ప్రవీణ్ అనే దర్శకుడు బండ్ల గణేష్ అనే నిర్మాత దగ్గరికి వస్తాడు. అతను బండ్ల గణేష్ చెప్పిన క్రేజీ అంకుల్స్ కథ ఇది. బాగా డబ్బు సంపాదించే ముగ్గురు నడి వయస్కులైన సమాజంలో మంచి పేరు సంపాదించిన వ్యక్తుల కథ ఈ క్రేజీ అంకుల్స్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజు (రాజా రవీంద్ర), బంగారం వ్యాపారం చేసే రెడ్డి(సింగర్ మనో) ఫైనాన్స్ వ్యాపారం చేసే రావు(భరణి శంకర్) ముగ్గురు మంచి స్నేహితులు.
ఒక అపార్ట్ మెంట్ లోనే కలిసి జీవిస్తూ ఉంటారు. అయితే ఈ ముగ్గురికి తమ భార్యలతో సంసార జీవితంలో సమస్యలు ఉంటాయి. ముగ్గురికి కామన్ ఇంట్రెస్ట్ కూడా సింగర్ స్వీటీ (శ్రీముఖి). రాజు పుట్టినరోజు నాడు ఆమె చేత ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారు. ఆ రోజు జరిగిన ఘటనతో ఈ ముగ్గురు జీవితాలు ఎలా మారిపోయాయి? ఎన్ని మలుపులు తిరిగాయి ? అనేది సినిమా కథ.
**Note:Hey! Would you like to share the story of the movie క్రేజీ అంకుల్స్ with us? Please send it to us ([email protected]).