X
Home టాప్ లిస్టింగ్

బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన భారీ మల్టీస్టారర్ మూవీస్ లిస్ట్

Author Administrator | Published: Saturday, May 14, 2022, 10:09 AM [IST]

తెలుగు సినిమాల్లో ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే ప్రేక్షకులు చాలా మంది ఉంటారుఆచార్య మూవీలో మెగా తండ్రీ తనయులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. అలా ఇద్దరు స్టార్ హీరోలు నటించగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలేవో చూద్దాం..


cover image
ఆచార్య
1

మెగా తండ్రీ తనయులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పూర్తి స్థాయిలో తొలిసారి నటించిన ’ఆచార్య’ మొదటి రోజు మొదటి ఆట నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసింది. క్రౌడ్ పుల్లర్స్ వంటి స్టార్స్ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. 

 

శంకర్ దాదా జిందాబాద్
2

మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ అందరి అంచనాలను తలికిందలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది

 

సుల్తాన్
3

సూపర్ స్టార్ కృప్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, నందమూరి బాలకృష్ణ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘సుల్తాన్’. కృష్ణత్రయం నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది.

మహా సంగ్రామం
4

సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ శోభన్ బాబు కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘మహా సంగ్రామం’. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సంయుక్తా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైమ్ డిజాస్టర్‌గా నిలిచింది

కృష్ణార్జునులు
5

దాసరి నారాయణ రావు దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, నట భూషణ శోభన్ బాబు కలిసి నటించిన మరో భారీ మల్టీస్టారర్ మూవీ ‘కృష్ణార్జునులు’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది.

యుద్ధం 1984
6

సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ‘యుద్ధం’. ఈ సినిమాలో కృష్ణ, కృష్ణంరాజు తండ్రీ తనయులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ సినిమాను దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది.

రామ కృష్ణులు
7

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలుగా జగపతి వి. రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రామకృష్ణులు’. ఈ సినిమా హిందీలో అమితాబ్, వినోద్ ఖన్నాల ‘హేరా ఫేరి’ సినిమాను కాస్త మార్చి తెరకెక్కించారు. ఇద్దరు బడా స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ మూవీ అనుకున్నంత రేంజ్‌లో మెప్పించ లేకపోయింది.

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+