twitter

    సీఎస్ఐ సనాతన్ స్టోరి

    సీఎస్ఐ సనాతన్ సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్, ఇన్వెస్టిగేటివ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాక‌ర్ పొన్న‌ప్ప ,మ‌ధు సూద‌న్ రావు, వసంతి తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రానికి అనీష్ సోలోమాన్ సంగీతం అందించారు. అజ‌య్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించగా.. శివ‌శంక‌ర్ దేవ్ దర్శకత్వం వహించారు. 

    కథ

    వీసీ ఫైనాన్స్ అధినేత విక్రమ్ చక్రవర్తి (తారక్ పొన్నప్ప) పేదలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి దేవుడిగా మారుతాడు. అదే సమయంలో విక్రమ్ చక్రవర్తిపై ఆర్థిక ఆరోపణలు కూడా ఉంటాయి. అతి తక్కువ కాలంలో బిజినెస్‌ను టాప్ రేంజ్‌కు తీసుకెళ్లి ఫోర్స్ జాబితాలోకి చేరుతాడు. ఆ సందర్భంగా జరిగిన పార్టీలో విక్రమ్ చక్రవర్తి దారుణ హత్యకు గురవుతాడు. సంచలనం రేపిన హత్య కేసును విచారించడానికి క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్ సనాతన్ (ఆది సాయికుమార్) రంగంలోకి దిగుతాడు. విక్రమ్ చక్రవర్తి వ్యాపార భాగస్వాములు మంత్రి రాజవర్ధన్ (మధుసూధన్ రావు), దివ్య (నందినీ రాయ్)ను సనాతన్ అనుమానితులుగా ఎందుకు భావించాడు? విక్రమ్ చక్రవర్తికి రాజవర్థన్‌కు ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి? దివ్యతో విక్రమ్ చక్రవర్తికి ఎలా సంబంధాలు ఉన్నాయి? సనాతన్, ప్రియురాలు సుదీక్ష (మిషా నారంగ్) ఎందుకు విడిపోయారు? సనాతన్ సోదరుడు సంజీవ్ కుమార్ ఎలా చనిపోయాడు? విక్రమ్ చక్రవర్తి హత్యకు కారణాలు ఏమిటి? విక్రమ్ చక్రవర్తి హత్యకు ఎవరు? ఎందుకు కుట్ర చేశారు? విక్రమ్ చక్రవర్తి కేసును సనాతన్ ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే సీఎస్ఐ సనాతన్ సినిమా 
    **Note:Hey! Would you like to share the story of the movie సీఎస్ఐ సనాతన్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X