దేవదాసు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, ఇలియాన, సయాజి షిండే, వేణు మాదవ్, ఎమ్ ఎస్ నారాయణ, రమ ప్రభ, విధ్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-నిర్మాత - వై వి ఎస్ చౌదరి నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినవాడు దేవదాస్ (రామ్) కాలేజి స్టుడేంట్, భానుమతి (ఇలియాన) ఒక పెద్దింటి అమ్మాయి. భానుమతి చదువు మొత్తం అమెరికాలో పూర్తిచేసి క్లాసికల్ డ్యాన్స్ కోసం ఇండియాకు వస్తుంది. దేవాదాసు ప్రేమలో పడుతుంది కాని కాటంరాజ్ ( షియాజి షిండే ) భానుమతి నాన్నా నమ్మించి ప్రేమించిన వాడితోనే పెళ్ళి చేస్తానని చేప్పి తనతోపాటు అమెరికాకు తీసుకోని పోతాడు, అక్కడికి వెళ్ళిన తరువాత భానుమతికి వేరే వాడితో పెళ్ళి చేయాలనుకుంటాడు. దేవదాస్ అమెరికాకు వెళ్లి తన ప్రేమను ఎలా కాపాడుకుంటాడు అనేది మిగతా కథా.