దేవస్థానం సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కె. విశ్వనాథ్, ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఆమని, కోవై సరళ, రావు రామేష్, రమణాచారి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జనార్ధన్ మహర్షి నిర్వహించారు మరియు బ్యానర్ సర్వే జనా సుఖినోభవంతు ఫిల్మ్స్ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు స్వర వీణాపాణి స్వరాలు సమకుర్చారు.
కథ
శ్రీమన్నారాయణ(కె. విశ్వనాథ్) చిత్తూరు నివాసి. పుణాల గురించి బాగా తెలిసిన వ్యక్తి. అయితే అతన్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు. దీంతో ఆ పెద్దాయన దేవస్థానంలోనే కాలం గడుపుతూ ఉంటాడు. దేవాలయానికి వచ్చే భక్తుల ప్రశ్నలను నివృత్తి చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే తన మరణం తర్వాత ఆ భక్తుల సందేహాలు తేర్చే వారి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యమూర్తి(బాలు) దీనికి తగినవాడని భావిస్తాడు. అయితే ఆ జాబ్ చేయడానికి సుబ్రహ్మణ్య మూర్తి నిరాకరిస్తాడు. కొన్ని రోజుల తర్వాత జీవితం యొక్క పరమార్థం తెలుసుకుని శ్రీమన్నారాయణ దారిలోకి వచ్చి లిరిసిస్ట్ గా మారతాడు సుబ్రహ్మణ్యమూర్తి. ఆధునికతతో ఆయన రాసిన హరికథలు బాగా పాపులర్ అవుతాయి. ఇద్దరు కలిసి వీటిని జనాల్లోకి తీసుకెళ్లి బాగా డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బుతో 'సర్వే జనా సుఖినోభవంతు' అనే ట్రస్టును ప్రారంభిస్తారు. పేద పురోహితులకు ఆర్థిక సహాయం, దేవాలయాల పునరుద్ధరణ కోసం వాటిని వాడుతుంటారు. ఈ క్రమంలో అనుకోని సంఘటన ట్రాజెడీకి దారి తీస్తుంది. మరి అదేమిటి? సినిమా ఉద్దేశ్యం ఏమిటి? అనేది తెరపై చూడాల్సిందే.