X
Home టాప్ లిస్టింగ్

గుర్తుండి పోయే లవ్ మూవీస్ సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్

Author Administrator | Updated: Tuesday, February 21, 2023, 09:45 AM [IST]

సినీ ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండి పోయే కొన్ని రామాంటిక్ లవ్ మూవీస్ వస్తుంటాయి. అలంటి లవ్ మూవీస్ లో కొత్త వచ్చిన హీరోయిన్స్ కి ఛాన్స్ వచ్చి అవి సూపర్ హిట్ అయితే ఎలా ఉంటుందో చెప్పనర్లేదు. ఆ సినిమల్లో నటించిన హీరోయిన్స్ ఒక ప్రెస్ ఫీలింగ్ ఆ సినిమాకి ఇస్తారు. అవి కాకుండా సాంగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు కూడా తోడు అయితే ఇంకా ఆ మూవీస్ ఎప్పటికి ప్రేక్షకుల మదిలో ఆలా వుంది పోతాయి. ఇంకా చెప్పాలి అంటే అలంటి మూవీస్ కి న్యూ హీరోయిన్స్ తో వచ్చిన గుర్తింపు పాత ఎంత పెద్ద హీరోయిన్ చేసిన రాదేమో అని అనిపిస్తుంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంట్రీ తో నే లవ్ మూవీ తో హిట్ కొట్టిన యాక్ట్రెస్ లిస్ట్ మీ కోసం


cover image
సదా
1

తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ హీరోయిన్ సదా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మొదట హీరో నితిన్ తో కలిసి జయం చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ తేజ ఎంత అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని సదా చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయని చెప్పవచ్చు. మొదటి చిత్రంతోనే తన నటనతో అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిన సదా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది టాలీవుడ్లో

ఇలియాన డి క్రుజ్
2

మొదట దేవదాసు సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా. దేవదాసు  చిత్రంతో మంచి మార్కులు సంపాదించుకున్నది .ఈ ముద్దుగుమ్మ ఆ వెంటనే మహేష్ బాబుతో కలిసి పోకిరి సినిమాలో నటించింది ఈ సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్గా మారడమే కాకుండా ఈ సినిమా తర్వాత దాదాపుగా కోటి రూపాయలు అందుకున్న మొట్టమొదటి హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరో సినిమాలలో నటించింది. 

సమంత రుతు ప్రభు
3

ఏం మాయ చేసావే సినిమాతో అందరిని మాయలో పడేసిన సమంత అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు.ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి వ‌న్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా త‌న హ‌వా కొన‌సాగిస్తోంది.

నిత్యామీనన్
4

అలా మొదలైంది అనే  సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  హీరోయిన్‌ నిత్యా మీనన్‌ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ.. పాత్రలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. అలా సక్సెస్‌తో కెరీర్‌లో దూసుకుపోతోంది నిత్యా మీనన్‌. ఇక ఈ ఏడాది స్కైలాబ్, భీమ్లానాయక్ వంటి చిత్రాలతో అలరించిన నిత్యా.. నటిగానే కాదు సింగర్‌గా కూడా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్‌ పాత్రలు పక్కన పెట్టి కేవలం కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తోంది. ఇదిలా ఉందే తాజాగా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది.

రాశీ ఖన్నా
5

రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే  సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటన‌తో పాటు క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటూ సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సందడి చేస్తోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి తనదైన యాక్టింగ్ స్కిల్ తో అతి తక్కువ సమయంలోనే పాపులర్ హీరోయిన్ గా మారింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా రెగ్యులర్ గా మూవీస్ చేస్తూ సత్తా చాటుతోంది. ఇటీవల కాలంలో దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్రాల్లోనూ నటిస్తూ హవాను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే రచ్చ చేస్తోంది.  

లావణ్య త్రిపాటి
6

అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.మొదటి సినిమానే హిట్ కావడంతో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో లావణ్య త్రిపాఠి నటించారు.     

పాయల్ రాజ్‌పుత్‌
7

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది  పాయల్‌ రాజ్‌పుత్‌. మొదటి సినిమాతో తెలుగులో అద్భుతాలు చేసిన పాయల్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. సీరియల్ యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన పాయల్ ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలన విజయం నమోదు చేసింది. హీరోయిన్ పాయల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. పాయల్ గ్లామర్, బోల్డ్ సీన్స్ కుర్రకారును ఊపేశాయి.పాయల్ రాజ్ పూత్‌ తక్కువ సమయం లోనే టాలీవుడ్ లో ఎక్కువ సినిమా లు చేసే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

మృణాల్ ఠాకూర్
8

‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి చిత్రంతోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంగ్రముగ్ధుల్ని చేసింది. సీతారామం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందీ చిన్నది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూకడుతున్నాయి. మృణాల్‌కు స్టార్ హీరో సరసన నటించే అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.  

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+