దేవుడు చేసిన మనుషులు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్ వెంకట్, బ్రహ్మాజీ, ఎమ్మెస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరాలు సమకుర్చరు.
కథ
ఓ రోజు వైకుంఠంలో విష్ణు మూర్తి(బ్రహ్మానందం)ని లక్ష్మి దేవి(కోవై సరళ)ని ఏదన్నా కథ చెప్పమని అడిగితే... ఆయన 'దేవుడు చేసిన మనుషులు' కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఆ కథలో ఇండియాలో ఉండే రవి (రవితేజ) సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతనికి దైవం నిర్ణయించిన జోడి ఇలియానా (ఇలియానా). ఆమె బ్యాంకాక్ లో డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఎమ్.ఎస్ నారాయణ(పనిలేని పాపన్న) అరటిపండు తిని తొక్క పారేయంటంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ అరటిపండు ఎఫెక్టుతో అనుకోకుండా ఎస్సై సుబ్బరాజు(సుబ్బరాజు) బ్యాంకాక్ డాన్ ప్రకాష్ (ప్రకాష్‌రాజ్) అనుచరుడుని చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ నుంచి ప్రాణం ముప్పు ఉన్న సుబ్బరాజు.. సెటిల్ మెంట్ రవి ద్వారా..ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకోవటాడు. దాంతో రవి.. బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకుంటాడు. బ్యాంకాక్ వెళ్లిన రవి అక్కడ ఇలియానాని ఎలా కలుసుకున్నాడు... ప్రకాష్ ని ఎలా డీల్ చేసాడన్నది ఫస్టాఫ్. సెకండాఫ్ కి వస్తే... ఎమ్.ఎస్ నారాయణం తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది. అదేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.