X
తెలుగు » సినిమాలు » దేవుడు చేసిన మనుషులు
దేవుడు చేసిన మనుషులు

దేవుడు చేసిన మనుషులు

Action | Romance | 15 Aug 2012 | A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

దేవుడు చేసిన మనుషులు స్టోరీ

దేవుడు చేసిన మనుషులు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్‌ వెంకట్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ నిర్వహించారు మరియు నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచె స్వరాలు సమకుర్చరు. కథ ఓ రోజు వైకుంఠంలో విష్ణు మూర్తి(బ్రహ్మానందం)ని లక్ష్మి దేవి(కోవై సరళ)ని ఏదన్నా కథ చెప్పమని అడిగితే... ఆయన 'దేవుడు చేసిన మనుషులు' కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఆ కథలో ఇండియాలో ఉండే రవి (రవితేజ) సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతనికి దైవం నిర్ణయించిన జోడి ఇలియానా (ఇలియానా). ఆమె బ్యాంకాక్ లో డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఎమ్.ఎస్ నారాయణ(పనిలేని పాపన్న) అరటిపండు తిని తొక్క పారేయంటంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ అరటిపండు ఎఫెక్టుతో అనుకోకుండా ఎస్సై సుబ్బరాజు(సుబ్బరాజు) బ్యాంకాక్ డాన్ ప్రకాష్‌ (ప్రకాష్‌రాజ్‌) అనుచరుడుని చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ నుంచి ప్రాణం ముప్పు ఉన్న సుబ్బరాజు.. సెటిల్ మెంట్ రవి ద్వారా..ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకోవటాడు. దాంతో రవి.. బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకుంటాడు. బ్యాంకాక్ వెళ్లిన రవి అక్కడ ఇలియానాని ఎలా కలుసుకున్నాడు... ప్రకాష్ ని ఎలా డీల్ చేసాడన్నది ఫస్టాఫ్. సెకండాఫ్ కి వస్తే... ఎమ్.ఎస్ నారాయణం తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది. అదేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

దేవుడు చేసిన మనుషులు కాస్ట్ & క్రూ

దేవుడు చేసిన మనుషులు సిబ్బంది సమాచారం

దర్శకత్వం పూరి జగన్నాధ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దేవుడు చేసిన మనుషులు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇక రెగ్యులర్ గా బ్రహ్మానందం,అలీ మధ్యన జరిగే కామెడీ పూరీ సినిమాల్లో హెలెట్ అవుతూంటుంది. అయితే ఈ సినిమాలో అదీ మైనస్ అయ్యింది. ఎప్పుడో పూర్వకాలం నాటి... దురదృష్ణం మన వెంట ఉంటే లక్ష్మి దేవి కూడా ఏమీ చేయలేదనే కథను ఎడాప్ట్ చేసారు... కానీ అది పండలేదు. రవితేజ మ్యానరిజంస్,డైలాగ్ డెలవరీ బోర్ కొట్టే స్ధితికి చేరుకున్నట్లు ఈ సినిమా గుర్తు చేస్తుంది. అలాగే చిత్రంగా ఇందులో పూరీ మార్కు డైలాగులు కూడా పెద్దగా లేవు.. ఉన్న కొద్దీ పేలలేదు. ఇలియానా... జులాయి సినిమాలో చెప్పినట్లు ఈ సినిమాలో కూడా.. కరవు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఉండటంతో ఆమె ప్లస్ కాలేకపోయింది. ఆడియో పరంగా రెండు పాటలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా సుబ్బలక్ష్మి పాట హైలెట్ అయ్యింది. పాటలకు కూడా ప్లేస్ మెంట్ లేకపోవటంతో క్లైమాక్స్ అయిపోయాక శుభం కార్డుతో పాట పెట్టడం అనేది ఈ సినిమాలోనే కనపడుతుంది. ఎడిటింగ్,కెమెరా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు పరంగా పెద్దగా ఏమీ లేదు..చుట్టేసినట్లు కనపడుతుంది. ఫైనల్ గా.. ఈ సినిమాలో చెప్పినట్లు తొక్క మీద జారిపడితే ఏమౌతుంది... జారిపడకపోతే ఏమౌంతుంది.. అన్నట్లుగా... కథ ఉంటే సినిమాలు ఎలా ఉంటాయి... కథ లేకపోతే ఎలా ఉంటాయి అన్నదానకి ఈ సినిమాని.. పూరి గత సినమాలను పోల్చుకోవచ్చు.

దేవుడు చేసిన మనుషులు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దేవుడు చేసిన మనుషులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+