ధమాకా సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వితేజ, శ్రీలీల, జయరాం, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్, ఆలీ, ప్రవీణ్, హైపర్ ఆది, పవిత్ర లోకేష్, తులసి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినేత్ర రావు నక్కిన వహించారు. నిర్మాతలు టి జి విశ్వా ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం భీమ్స్ అందించారు.
కథ
పీపుల్స్ మార్ట్ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత చక్రవర్తి కుమారుడైన వివేకానంద చక్రవర్తి అలియాస్ ఆనంద్ చక్రవర్తి (రవితేజ) తండ్రికి అండదండగా ఉంటాడు. అయితే చక్రవర్తి ఓ కారణంగా తన కంపెనీ షేర్లలో 50 శాతం ఉద్యోగులకు రాసిచ్చి కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకొంటాడు. కంపెనీ తదుపరి సీఈవోగా ప్రకటించే ముందు పీపుల్స్ మార్ట్ కంపెనీపై కన్నేసిన జేపీ (జయరాం) చక్రవర్తి నుంచి బలవతంగానైనా వ్యాపారాన్ని లాగేసుకోవాలని కుట్ర పన్నుతాడు.కూకట్‌పల్లిలోని మాస్ ఏరియాలో ఉండే స్వామి (రవితేజ) ఉద్యోగవేటలో ఉంటాడు. తన ప్రాంతంలో ఉండే ప్రణవి (శ్రీలీల)తో ప్రేమలో ఉంటాడు. అయితే ప్రణవితో స్వామి పెళ్లి జరిపించడానికి తండ్రి (రావు రమేష్) అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. పీపుల్ మార్ట్ కంపెనీని ఆక్రమించుకోవాలనుకొన్న జేపీ కుట్రను ఆనంద చక్రవర్తి అడ్డుకొన్నారా? పీపుల్స్ మార్ట్ కంపెనీ అధినేత ఎందుకు తన పదవిని వదులుకొన్నారు? కంపెనీ షేర్లను ఉద్యోగులకు ఎందుకు ఇచ్చాడు. పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ ఎందుకు కన్నేశాడు? ఉద్యోగ వేటలో ఉన్న స్వామి చివరకు జాబ్ సంపాదించాడా? పీపుల్స్ మార్ట్ కంపెనీకి స్వామికి సంబంధం ఏమిటి? పీపుల్స్ మార్ట్ కంపెనీపై జేపీ కుట్రలను స్వామి అడ్డుకోవాలని ఎందుకు రంగంలోకి దిగాడు? శ్రీలీలతో పెళ్లి విషయంలో ఆమె తండ్రిని స్వామి ఎలా ఒప్పించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ధమాకా సినిమా కథ.