X
Home టాప్ లిస్టింగ్

మణిరత్నం టాప్ 7 కెరీర్ బెస్ట్ మూవీస్ లిస్ట్

Author Administrator | Published: Wednesday, May 24, 2023, 12:04 PM [IST]

భారతీయ సినిమా రంగానికి దొరికిన ఓ ఆణిముత్యం మణిరత్నం. దర్శకుడిగా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా మణిరత్నం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సౌత్‌ సినిమాలు అంటే చిన్న చూపు చూస్తున్న సమయంలో మణిరత్నం చేసిన సినిమాలు బాలీవుడ్‌ మేకర్స్‌ దృష్టిని ఆకర్షించాయి. మణిరత్నంతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ మేకర్స్‌ ఆసక్తి చూపించే వారు. బాలీవుడ్‌ సినిమాలకు పోటీగా మణిరత్నం సినిమాలు ఉంటాయి. ప్రేమకథలతో పాటు మన దేశంలో జరిగిన వివిధ చారిత్రక సంఘటనలపై, ఉగ్రవాద సమస్యలపై కూడా గొప్ప సినిమాలను రూపొందించిన ఏకైక దర్శకుడు మణిరత్నం. అందులో మనసుకు హత్తుకునే సినిమాలు కొన్నైతే.. మంచిని పంచే సినిమాలు మరెన్నో. మణిరత్నం కెరీర్‌ టాప్‌ 7 బెస్ట్‌ చిత్రాలు ఇవే.


cover image
1

1987లో వచ్చిన ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ హీరోగా నటించాడు. ఒక హీరోను ఇలాగా కూడా చూపించవచ్చా అన్నట్లుగా ఈసినిమా సాగుతుంది. విలక్షణమైన కథతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో మరియు తెలుగులోనే కాకుండా పలు భాషల్లో సూపర్‌ హిట్‌ను సాధించి రికార్డులు సృష్టించింది.

 

రోజా
2

1992లో వచ్చిన ఈ సినిమా సరికొత్త ప్రేమ కథలకు ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్నో సినిమాలు కూడా రోజా ఫార్ములను ఫాలో అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అరవింద్‌ స్వామి, మధుబాల జంటగా తెరకెక్కిన ఈ సినిమాలోని పాటలు అద్బుతం, ఇప్పటికి ఆ పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తూనే ఉంటాయి. ఉగ్రవాదం బ్యాక్‌ డ్రాప్‌తో అద్బుతమైన ప్రేమ కథను దర్శకుడు మణిరత్నం ఈ చిత్రంలో చూపించాడు.

బొంబాయి
3

ముంబయిలో జరిగిన మారణహోమం, అక్కడ ఉండే పరిస్థితులను ఒక చక్కని ప్రేమ కథను జోడిచ్చి దర్శకుడు మణిరత్నం చూపించాడు. 1995లో అరవింద్‌ స్వామి, మనీషా కోయిరాలాలతో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదల అయిన అన్ని భాషల్లో కూడా బొంబయి సినిమా సెన్షేషనల్‌ సక్సెస్‌ దక్కించుకుంది.

గీతాంజలి
4

నాగార్జున, గిరిజ జంటగా తెరకెక్కిన గీతాంజలి సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రంగా నిలిచింది. హీరో క్యాన్సర్‌ పేషంట్‌ ఏంటీ అంటూ మొదట అంతా పెదవి విరిచారు. కాని ఆ సినిమా గుండెలను పిండేసి అప్పట్లోనే సెన్షేషనల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది. ఇలాంటి కథలతో కూడా సినిమా తీస్తారా అన్నట్లుగా ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి.

5

షారూఖ్ ఖాన్, మనీషా కోయిరాల నటించిన దిల్ సే సినిమా 1998లో విడుదలై ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో దర్శకుడు మణిరత్నం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో నెట్పాక్ అవార్డును మణిరత్నం సాధించారు. అంతేకాకుండా జాతీయ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు "దిల్ సే" సినిమాకు లభించడం విశేషం.

6

మహాభారతంలోని దుర్యోధన, కర్ణ, అర్జున పాత్రలను ఆధారంగా తెరకెక్కించిన సినిమా దళపతి. రజనీకాంత్, ముమ్ముట్టి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1992లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు గానూ ఉత్తమ దర్శకుడిగా మణిరత్నం ఫిలిమ్ ఫేర్ అందుకున్నారు. మరో రెండు ఫిలిమ్ ఫేర్ అవార్డులు ఈ సినిమాకు లభించాయి.

 

7

1990 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా చిన్న పిల్ల కథ. బేబీ శామిలితో తెరకెక్కిన ఈ సినిమా కూడా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ సెన్షేషన్‌ అయ్యింది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా యాంటీ క్లైమాక్స్‌ కారణంగా నిరాశ పర్చినా కూడా ఇప్పటికి సినిమా ఒక అద్బుతమే అంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+