X
ధర్మయోగి
Action | Thriller | 29 Oct 2016 |
Telugu

ధర్మయోగి స్టోరీ

ధర్మయోగి సినిమా తమిళ్ లో రోపొందిన 'కోడి' ఈ చిత్రం 'ధర్మయోగి' (ది లీడర్) పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు.. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుష్, త్రిష, అనుపమ పరమేశ్వరన్, ఎస్ ఎ చంద్రశేఖర్, సతీష్, సరణ్య మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ నిర్వహించారు మరియు శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మ్ంట్స్ పతాకంపై సి ఎచ్ సతీష్ కుమార్ నిర్మాత తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చరు. 

కథ

ఇద్దరు కవలలుగా కనిఒపించిన ధనుఇష్ కొడీ, అంబూ అనే పాత్రలలో కనిపిస్తాడు. పెద్దవాడైన కోడి (ధనుష్) తన తండ్రిలాగే ఒక రాజకీయ పార్టీలో కీలకమైన కార్యకర్తగా తిరుగుతూంటాడు. ఇక తమ్ముడు అన్బు (ధనుష్) మాత్రం తల్లిచాటు బిడ్డ. ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, అమాయకంగా కనిపిస్తుంటాడు. రాజకీయాలలోనే ఉన్న కోడి అపోజిషన్ పార్టీకి చెందిన రుద్ర (త్రిష)తో ప్రేమలో పడతాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని, రాజకీయాల్ని వేటికవే వేరుగా చూస్తూ వస్తుంటారు ఈ ఇద్దరు ప్రేమికులు. అయితే ఒక దశలో మాత్రం తమ ఇద్దరి రాజకీయ నేపథ్య ప్రభావం వీళ్ళ ప్రేమ మీఅ కూడా పడే పరిస్థితి వస్తుంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో... తమ నియోజకవర్గంలో ఉపఎన్నికలు రావడం... ఆ ఉపఎన్నికల్లో కోడి, రుద్ర ఇద్దరూ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపిక కావడం చకచకా జరిగిపోతాయి. రాజకీయంగా శత్రువులుగా మారిన ఈ ఇద్దరు ప్రేమికులు, వ్యక్తిగతంగా కూడా శత్రువులుగా మారిపోతారు. మరీ ధారుణం ఏమిటంటే ప్రేమని కూడా మర్చిపోయి అధికారం కోసం కోడి నే హత్య చేయిస్తుంది రుద్ర. అయితే రాజకీయంగా సెంటిమెంట్ వర్కవుట్ కావడంతో... తప్పనిసరి పరిస్థితుల్లో, తనకు ఇష్టంలేకపోయినా... అధికారాన్ని చనిపోయిన కోడి తమ్ముడు అన్బుకు త్యాగం చేస్తుంది రుద్ర. సరిగ్గా ఇక్కడ్నుంచే ట్విస్ట్ మొదలౌతుంది. అప్పటివరకు అమాయకంగా కనిపించిన అన్బు..ఒక్కసారిగా సిసలైన రాజకీయ నాయకుడిగా మారిపోతాడు. పనిలోపనిగా తన కవల సోదరుడ్ని చంపిన వ్యక్తులు ఎవరనే విషయంపై సొంతంగా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాడు. దీంతో కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి త్రిష ఏమైంది.. అన్బు తను అనుకున్నది సాధించాడా..?? అన్న ప్రశ్నలకి సమాధానం కావాలీ అంటే సినిమా చూడాల్సిందే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+