డర్టీ హరి సినిమా బోల్డ్, డర్టీ కథాంశంతో తెరకెక్కుతొంది. ఇందులో శ్రవణ్ రెడ్డి, రుహని శర్మ, సామ్రాట్ కౌర్, జబర్దస్త్ మహేష్, సురేఖ వాణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎంఎస్ రాజు వహించారు.ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మించారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు.
కథ
ఉద్యోగ అవకాశాల కోసం సిటీకి వచ్చిన హరి (శ్రవణ్ రెడ్డి) చెస్ ప్లేయర్. ఓ క్లబ్‌లో చెస్ కోచ్‌గా ఉద్యోగంలో చేరుతాడు. అక్కడే వసుధ (రుహాని శర్మ) కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. వసుధతో పరిచయం ప్రేమగా ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే వసుధ సోదరుడి ప్రియురాలు జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో శ్రవణ్ ఆకర్షణలో పడుతాడు. వసుధతో పెళ్లి తర్వాత కూడా జాస్మిన్‌తో హరి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతాడు. దాని ఫలితంగా జాస్మిన్ ప్రెగ్నెంట్‌గా మారుతుంది. వసుధతో హరి రిలేషన్ ఎలా ఉంది? ఓ వైపు వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌కు ఎలా దగ్గరయ్యాడు? వసుధను పెళ్లి చేసుకోవడానికి హరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. వసుధ సోదరుడికి జాస్మిన్‌కు ఎందుకు బ్రేకప్ జరుగుతుంది. బ్రేకప్ తర్వాత జాస్మిన్‌కు ఎలా చేరువ అయ్యాడు. జాస్మిన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే డర్టీ హరి.