X
దూకుడు
Action | 23 Sep 2011 | U/A |
Telugu

దూకుడు స్టోరీ

దూకుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, ధర్మవరపు సుబ్రమణ్యం, మాస్టర్ భరత్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు ఆచంట గోపీచంద్, ఆచంట రామ్ & అనీల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు.

కథ

తండ్రి పగను తీరుస్తూ, పనిలో పనిలో తన డ్యూటీ నెరవేర్చే పోలీస్ కథ దూకుడు. అజయ్(మహేష్)కి చిన్నప్పటినుంచీ దూకుడు ఎక్కువ. అతని తండ్రి ఎమ్మల్యే శంకర నారాయణ(ప్రకాష్ రాజ్) చాలా నిజాయితీ పరుడు, స్వర్గీయ ఎన్టీఆర్ కి వీరాభిమాని. ఆయన తన కొడుకు కూడా తన లాగే ఎమ్మల్యే అయ్యి ప్రజాసేవ చెయ్యాలనుకుంటాడు. ఈలోగా ఆయన ప్రత్యర్ధుల దాడిలో కోమాలోకి వెళ్ళిపోతాడు. దాంతో మహేష్ ప్యామిలీ ముంబైకి షిప్ట్ అయిపోతుంది. అక్కడే మహేష్ పోలీస్ ఆఫీసర్ గా ఎదిగి టర్కీ వంటి దేశాలు వెళ్ళి అండర్ కవర్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. పనిలో పనిగా అక్కడ ప్రశాంతి(సమంత)తో ప్రేమలో పడిపోతాడు. టర్కిలో పని పూర్తి చేసుకుని వచ్చిన అతనికి పధ్నాలుగు సంవత్సరాల నుండి కోమాలో ఉన్న తండ్రి కళ్లు తెరచినట్లు తెలుస్తుంది. దాంతో అజయ్ అక్కడికి వెళితే డాక్టర్..హటాత్తుగా షాకింగ్ గా ఉండేవేమీ చెప్ప్దద్దంటాడు. అప్పుడు తండ్రిని బ్రతికించుకోవటం కోసం అజయ్ తన తండ్రి కి నచ్చే విధంగా నాటకం ఆడటం మొదలెడతాడు. అందులో భాగంగా తాను ఎమ్మల్యేనని, ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి నమ్మిస్తాడు. మరో ప్రక్క తండ్రిని దెబ్బ కొట్టిన విలన్స్ ను కూడా నాటకం ఆడి నాటకీయంగా తన తండ్రి చేతే ఎలా చంపిస్తాడనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+