ఈగల్ మూవీ క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధూ, కావ్య థాపర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ ఘట్టమనేని వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ నిర్మించారు. సంగీత దర్శకుడిగా డవ్ జంద్ పరిచయం కాబోతున్నాడు.
టీజర్
ఒక హంతకుడి కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు వెతుకుతూ ఉంటాయి. ముందు అతనో పెయింటర్ అని తెలుస్తుంది. తర్వాత పత్తి రైతులకు అత్యంత కావాల్సిన మనిషిగా ఎవరెవరో గొప్పగా చెబుతారు. ఎన్నో అవతారాలు ఎన్నో రూపాలు. ఒకే ఐడెంటిటీ ఎక్కడ ఉండదు. దీంతో అతన్ని పట్టుకోవడం అంతు చిక్కని రహస్యంగా మారుతుంది. ఇంతకీ ఈగల్ వేట ఎవరి కోసం, దేని కోసం లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జనవరి దాకా వెయిట్ చేయక తప్పదు.