యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడంటే ఈయన్ని సీనియర్ హీరో అంటున్నారు కానీ.. గతంలో స్టార్ హీరో రేంజ్లో సూపర్ హిట్లను అందించిన వారిలో ఇతను కూడా ఒకరు. హై ఇంటెన్సిటీ, ఎమోషనల్ డ్రామా మరియు పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్స్ మన రాజశేఖర్. అంతేకాదు ఎన్నో ఫ్యామిలీ మూవీస్ ను కూడా అందించారు. ఈయన్ని ప్రేక్షకులు మరిచిపోతున్నారు అనుకునే టైములో సాలిడ్ హిట్ ఇచ్చి.. కంబ్యాక్ ఇవ్వడం ఈయన స్టైల్. గత మూడేళ్లలో ఈయన ‘పి.ఎస్.వి.గరుడవేగ’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో నటించారు. వీటిలో ‘పి.ఎస్.వి.గరుడవేగ’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ గారు ఆయన కెరీర్లో కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారు.