ఏక్ మినీ కథ సినిమా కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ శోభన్, కావ్య తప్పర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్, బ్రహ్మజి, సప్తగిరి, సుదర్శన్, పోసాని కృష్ణమురళి, జబర్దస్త అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్, ప్రభు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ రాపోలు వహించారు. ప్రవీణ్ లక్క రాజు సంగీతం అందించారు.
కథ
సివిల్ ఇంజినీర్ సంతోష్ (సంతోష్ శోభన్)కు తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే సమస్య బాల్యం నుంచే వెంటాడుతుంటుంది. తనకున్న సమస్యకు పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అమృత (కావ్య థాపర్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత తన సంసారానికి పనికి వస్తానా లేదా అనే మానసిక భయం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమస్యల మధ్య అమృత, సంతోష్ మధ్య విభేదాలు పెరిగి విడిపోతారు? సంతోష్‌కు పురుషాంగం చిన్నగా ఉందనే సమస్య తనలో ఎలా పెరిగింది? ఆ తర్వాత తన పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సంతోష్‌ను తండ్రి రామ్మోహన్ (బ్రహ్మాజీ) ఎలా అపార్థం చేసుకొన్నాడు? సంతోష్, అమృత మధ్య ఎలాంటి అపోహలు చోటు చేసుకొన్నాయి? సంతోష్‌కు స్వామిజీ (శ్రద్దా దాస్) ఎలాంటి పరిష్కారం చూపించింది. చివరకు సంతోష్‌కు ఆ సమస్య తీరిందా? సంతోష్, అమృత ఒక్కటయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానమే ఏక్ Mini కథ.