ఎనిమి మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విశాల్ కృష్ణ, ఆర్య, మిర్నలిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాష్ రాజ్, తంబీ రామయ్య, కరుణాకరన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి ఆనంద్ శంకర్ వహించారు. నిర్మాత ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ ఎస్, సామ్ సి ఎస్ అందించారు.
కథ
సూర్య(విశాల్), రాజీవ్(ఆర్య) బాల్యంలో ఎలా కలిశారు? అనే కథతో సినిమా ప్రారంభం అవుతుంది. సూర్య తండ్రి రిస్క్ రామలింగం(తంబి రామయ్య)కి రిస్క్ అంటే చాలా భయం. సూర్య తల్లి చనిపోవడంతో అన్నీ తానై పెంచుతూ ఉంటాడు. అదే సమయంలో సూర్య పక్కింట్లో రాజీవ్ తన పారి(ప్రకాష్ రాజ్)తో కలిసి దిగుతాడు. రాజీవ్ తండ్రి సూర్యలో పట్టుదలను చూసి తన కొడుకుతో పాటు సూర్యకి కూడా పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. ఇద్దరినీ మంచి పోలీసులుగా చూడాలనుకుంటాడు. అనుకోని పరిస్థితులలో రాజీవ్ తండ్రి చనిపోతాడు.. దీంతో రాజీవ్, సూర్య ఇద్దరు విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ వాళ్ళిద్దరూ సింగపూర్ లో ఉన్న లిటిల్ ఇండియా అనే ఒక ప్రదేశంలో ఎలా కలిశారు ? కలిశాక వీళ్లిద్దరూ ఒకరినొకరు ఎలా పలకరించు కున్నారు? స్నేహితులుగా ఉన్న వీరు శత్రువులుగా ఎందుకు మారారు ? వీరికి అశ్విత(మృణాళిని రవి), అనీషా(మమతా మోహన్ దాస్)లతో సంబంధం ఏమిటి అనేది తెర మీద చూడాల్సిందే.