ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాకేష్ వర్రె, గర్గేయి యెల్లప్రగడ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భసవ శంకర్ ఈదయ్ వహించారు మరియు నిర్మాత రాకేష్ వర్రె నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ శర్మ అందించారు.
కథ
ప్రాణానికి కంటే కులాన్ని ఎక్కువ ప్రేమించే దుర్గాప్రసాద్ (వంశీ నెక్కంటి) కూతురు హరిత (గార్గేయి ఎల్లాప్రగడ). ఓ కారణంగా తమ కులం వారితోనే ఉండాలని కూతురుకు హిత బోధ చేస్తుంటాడు. కట్టడి మధ్య తన కూతురును పెంచుతూ నిత్యం పర్యవేక్షణలో ఉంటాడు. ఈ క్రమంలో తన కులం కాని యువకుడు హరి (రాకేష్ వర్రె)కు దగ్గరవుతుంది. అతని పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ క్రమంలో హరిత తండ్రి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడుతాడు. తండ్రి కులం పట్టింపు వల్ల హరితకు ఎలాంటి సమస్యలు ఏర్పడ్డాయి. హరి, హరితకు ప్రేమకు కులం అడ్డంకిగా మారిందా? దుర్గా ప్రసాద్‌కు ఉన్న కులం పిచ్చి అతడికి ఎలాంటి ఇబ్బందలకు గురిచేసింది? ఇలాంటి ఇక్కట్ల మధ్య చివరకు హరి, హరిత కులాంతర వివాహం జరిగిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఎవ్వరికీ చెప్పొద్దు సినిమా కథ.