ఫ్యాసన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన పాత మధురం 'లేడీస్ టైలర్' సినిమాకి సీక్వెల్ని రూపొందిస్తున్నారు. ఇందులో సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్, మానస, కృష్ణ భగవాన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించారు మరియు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు అందించారు.
కథ
లేడీస్ టైలర్ సుందరం, సుజాత టీజర్ల కొడుకైన గోపాళం(సుమంత్ అశ్విన్) తండ్రి వృత్తినే కొనసాగిస్తూ చుట్టు పక్కల ఊర్లలో మంచి పనితనం ఉన్న లేడీస్ టైలర్ గా పేరు తెచ్చుకుంటారు. చేసేది టైలరింగే అయినా ఎవరైనా లేడీస్ టైలర్ అంటే అస్సలు నచ్చదు గోపాళానికి. తనను తాను ఫ్యాషన్ డిజైనర్ గా చెప్పుకుంటాడు. వీలైనంత త్వరగా సిటీలో షాపు తెరిచి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ గా పేరు తెచ్చుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలనే డ్రీమ్స్ లో ఉంటాడు. ఓ రోజు జ్యోతిష్కుడు ఫ్యాషన్ డిజైనర్ చేతిలో ఉన్న రేఖ చూసి అది మామూలు రేఖ కాదని, మన్మధరేఖ అని..... ఈ రేఖ లక్షల్లో ఒకరికి మాత్రమే ఉంటుందని, ఈ రేఖ ఉన్నవాళ్లు ఎలాంటి అమ్మాయిలనైనా ఇట్టే ప్రేమలో దింపే శక్తి కలిగి ఉంటారని చెబుతాడు. దీంతో ఊర్లో బాగా డబ్బున్న అమ్మాయిలను చూసి వారిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుని..... అలా వచ్చిన డబ్బుతో సిటీలో పెద్ద షాపు పెట్టాలనే ఆలోచనలో ఉంటాడు. ఈ క్రమంలోనే మొదట గేదెల రాణి(మానస), తర్వాత అమ్ములు(మనాలి రాథోడ్), ఆ తర్వాత మహాలక్ష్మి(అనీషా ఆంబ్రోస్) ...... ఇలా ఒకరికంటే ఒకరు బాగా డబ్బున్న అమ్మాయిలను ప్రేమలో దించే ప్రయత్నం చేసి చివరకు తన చావు మీదకు తెచ్చుకుంటాడు. చివరకు గోపాళం పరిస్థితి ఏమైంది? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది తెరపై చూడాల్సిందే.